రఘురామకృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

MP Raghuramakrishnam Raju, Kodi Katti Case, CM Jagan, AP Highcourt, YS Sharmila, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, andhra pradesh news, AP Political Updates, Jagan Latest News, Mango News Telugu, Mango News
MP Raghuramakrishnam raju, Kodi katti case, CM Jagan, AP highcourt

ఐదేళ్లుగా నలుగుతున్న కోడికత్తి కేసులో..శ్రీనివాస్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. శ్రీనుకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.గత ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనుకు బెయిల్‌ లభించడంపై  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశారు.

ఏపీ సీఎం జగన్‌ను కోడికత్తి జగన్ అని పిలవాల్సింది..కానీ  ఆయనేమో ముఖ్యమంత్రి అయ్యారని రఘురామ కామెంట్లు చేశారు. కానీ శ్రీనివాస్ మాత్రం కోడికత్తి శ్రీనుగా మిగిలిపోయాడని ఎద్దేవా చేశారు. అది  హత్యా యత్నం కూడా కాదని.. కేవలం హత్యా ప్రయత్నం చేసినట్టు జరిగిన..జగన్ ఆడిన  జగన్నాటకంలో ఓ పాత్రను పోషించినందుకు శ్రీనుకు ఐదేళ్లు  బెయిల్ రాకుండా జైల్లో పెట్టడం అన్యాయమే కాకుండా అతి దారుణమని రఘురామకృష్ణం రాజు కామెంట్ చేశారు.

శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు కాకుండా సీఎం స్థాయి వ్యక్తి ఆపాలని చూసినా.. సీఎం జగన్ కోర్టుకి హాజరు కాకపోయినా కూడా కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలపైన ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఇంకా పెంచేలా హైకోర్టు సంచలన తీర్పుని ఇవ్వడంపై రఘురామ ఆనందం చేశారు. ఇన్ని సంవత్సరాలు బెయిల్ రాకపోవడం దురదృష్టకరం అని.. అయితే ఇంకా పొడిగించకుండా ఇప్పటికైనా బెయిల్ రావడం హర్షించదగిన విషయం అన్నారు.

ఎంత పెద్ద స్థాయి వారైనా న్యాయాన్ని కొంతకాలం మాత్రమే ఆపగలరు కానీ.. న్యాయాన్ని సమాధి చేయలేరన్న విషయం ఏపీ వాసులకు ఈ రోజే తెలిసిందని రఘురామకృష్ణం రాజు చెప్పుకొచ్చారు. ఓ వైపు ఈ రోజు  ఢిల్లీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల నాయకులంతా.. ఆంధ్రాభవన్ లో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న ఈ సమయంలో  కోడికత్తి కేసులో శీనుకి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయమని రఘురామ  హర్షం వ్యక్తం చేసారు. ఇలా బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ లాగా ఇలా ఒకేరోజు ఒకేసారి రెండూ  జరగడం యాదృచ్ఛకమా..? లేక ఇంకేమన్నానా..? అని రఘురామకృష్ణంరాజు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 17 =