ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీపీఎస్‌‌పై చర్చలకు రేపు మరోసారి ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం

AP Govt Welcomes State Employee Unions To Discuss on CPS Issue Tomorrow, Ap Govt Invites Employee Unions, AP Govt Invites Teachers Union for Talks, Andhra Pradesh Talks Over Cps End Incomplete,AP Employee CPS Issue, Mango News, Mango News Telugu, Contributory Pension Scheme, AP CPS Issue, Govt Employees Demand Repeal Of Cps, AP Consultative meeting on CPS, CPS Latest News And Updates, Andhra Pradesh News And Live Updates

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మంత్రి బొత్స సత్యనారాయణతో సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమవ్వడం తెలిసిందే. అయితే ఈ భేటీలో సీపీఎస్‌‌పై ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో సమావేశం అసంపూర్తిగా ముగిసింది. భేటీ అనంతరం ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. చర్చల్లో భాగంగా మంత్రి బొత్స గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్‌) విధానానికి ఒప్పుకోవాలని కోరగా, ఆయన ప్రతిపాదనను అంగీకరించబోమని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జీపీఎస్‌‌పై ఉద్యోగులకున్న అభ్యంతరాలు తెలియజేయాలని మంత్రి బొత్స సూచించగా, పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. దీంతో ఈ అంశంపై మరింత స్పష్టత కోసం రేపు ఇరు వర్గాలు మరోసారి చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. దాదాపు 20 మంది ఉద్యోగ సంఘాల నేతలను బుధవారం సాయంత్రం చర్చలకు రావాల్సిందిగా కోరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =