ఆ నియోజకవర్గం నుంచే నాగబాబు పోటీ?

Nagababu ,Anakapalli seat, Nagababu is contesting from Anakapalli constituency,tdp,ycp, janasena,pawan kalyan, loksabha, Lok Sabha elections, Kakinada, Kakinada MP constituency, anakapalli, Assembly elections, Mango News Telugu, Mango News
Nagababu ,Anakapalli seat, Nagababu is contesting from Anakapalli constituency,tdp,ycp, janasena,pavan kalyan

గత ఎన్నికల్లో ఓటమితో వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రచారాలలో మాత్రమే చేస్తానని.. పోటీ చేయనంటూ నాగబాబు ప్రకటించారు. కానీ మారిన రాజకీయ సమీకరణాలతో నాగబాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. టీడీపీతో జనసేన కలిసివెళ్లడంతో.. విజయావకాశాలు మెరుగుపడ్డాయన్న సర్వేల లెక్కలతో ఆయన ఈ ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్  జనసేన నుంచి  రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా  ఓడిపోయారు. అటు నాగబాబు  నరసాపురం ఎంపీ స్థానానికి జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలుపొందిన చిరంజీవి తప్ప.. నాగబాబు, పవన్ కళ్యాణ్  చట్టసభలకు ఎన్నిక కాలేదు. కానీ ఈసారి పవన్ ఎలా అయినా ఈ ఎన్నికలలో గెలవాలన్న కసితో ఉన్నారు. ఇప్పుడు పవన్‌తో పాటు  నాగబాబు ఎన్నికల్లో పోటీ చేస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు.

టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేనకు మచిలీపట్నంతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానాన్ని కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీ అయిన వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం, సాన సతీష్ కుమార్ కు కాకినాడ లోక్ సభ స్థానాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. నాగబాబుకు నరసాపురం లోక్ సభ స్థానాన్ని కేటాయించాలనుకుంటే అక్కడ రఘురామకృష్ణం రాజు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. దీంతో అనకాపల్లి నుంచి నాగబాబుకు బాగుంటుందని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు అనకాపల్లి ఎంపీ స్థానానికి ఇప్పటికే టీడీపీలో  విపరీతమైన పోటీ ఉంది. అక్కడ చింతకాయల అయ్యన్నపాత్రుడు కొడుకు..చింతకాయల విజయ్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బైరా దిలీప్ చక్రవర్తి అనే కొత్త పేరు కూడా వినిపిస్తోంది. ఇటువంటి సమయంలోనే అనకాపల్లి టికెట్ కోసం నాగబాబు పేరు తెరమీదకు వచ్చింది. ఒకవేళ పవన్ పట్టుబడితే మాత్రం..టీడీపీ నేతలందరికీ నచ్చజెప్పి అనకాపల్లి సీటును నాగబాబుకు కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.మరి అనకాపల్లి సీటు ఎవరికి దక్కుతుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =