ప‌వ‌న్ వార్నింగ్‌కు అవాక్క‌యిన విరాళాల దాత‌లు

Janasena, Pawan kalyan, AP Elections, TDP-Janasena Alliance, Pawan Warning, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, chandrababu naidu, andhra pradesh politics, AP updates, AP news, Mango News Telugu, Mango News
Janasena, Pawan kalyan, AP Elections, TDP-Janasena Alliance

రాబోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని తెలుగుదేశం – జ‌న‌సేన కూట‌మి ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇరు పార్టీలూ సీట్ల స‌ర్దుబాటు, అభ్య‌ర్థుల ఎంపికపై తీవ్ర‌మైన త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు చేస్తున్నాయి. ఎక్క‌డా ఎటువంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా ఆదినుంచే అప్ర‌మ‌త్తంగా ఉంటున్నాయి. అధికార‌ప‌క్షంపై వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో ఈ కూట‌మిలోని సీట్ల‌కు డిమాండ్ ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఆశావ‌హులు ఎవ‌రిదారుల్లో వారు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. టీడీపీ లేదా జ‌న‌సేన నుంచి టికెట్ పొందేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. టీడీపీ జ‌త‌క‌ట్ట‌డంతో జ‌న‌సేన‌కు కూడా డిమాండ్ పెరిగింది. ఆ పార్టీ నుంచి సీటు పొందేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ ను ఆక‌ట్టుకోవ‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. కొంద‌రు పార్టీకి ఫండింగ్ చేయ‌డం ద్వారా, ఇంకొంద‌రు రిక‌మండేష‌న్ల ద్వారా టికెట్లను ద‌క్కించుకునే ప‌నిలో ఉన్నారు.

సాధార‌ణంగా పార్టీకి ఫండ్స్ వ‌స్తున్నాయంటే అధినేత‌కు ఆనందంగానే ఉంటుంది. ఇచ్చేవారి ప‌ట్ల సానుకూల ధోర‌ణి ఏర్ప‌డుతుంది. అయితే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కొంద‌రిపై కోపం తెచ్చిపెట్టింది. పార్టీకి చెక్కులు ఇచ్చిన‌వారిపై ఆయ‌న సీరియ‌స్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అసలేం జరిగింది అంటే.. కొంతమంది ప్రముఖులు జనసేనకు విరాళం ఇస్తున్నామని చెప్పి చెక్కులు ఇచ్చారు. ఆ తర్వాత వారు తమ మనసులో మాటను బయటపెట్టారు. చెక్కులు ఇచ్చిన తర్వాత పలానా సీటు కావాలని డిమాండ్ చేశారు. దీంతో జనసేనాని పవన్ కల్యాణ్ కు కోపం వచ్చింది. నేను అడక్కపోయినా జనసేనకు విరాళం పేరుతో చెక్కులు ఇచ్చి, ఇప్పుడు సీట్లు అడగటం ఏంటని.. ఆశావహులపై సీరియస్ అయ్యారు పవన్ కల్యాన్. అసెంబ్లీ, లోక్ సభ సీట్లు అడిగిన వారి చెక్‌లు వెనక్కి పంపాలని తన పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు పవన్ కల్యాణ్. పవన్ ఆదేశాలతో 7 చెక్కులను వెనక్కిపంపేశారు జనసేన నాయకులు. పార్టీకి విరాళం పేరుతో వారు ఇచ్చిన డబ్బుల చెక్ ను తిరిగి వారికే పంపేశారు. ఊహించని ఈ పరిణామంతో ఆశావహులు కంగుతిన్నారు. పవన్ నిర్ణయం వారిని షాక్ గురి చేసింది. తాము ఒకటి తలస్తే మరొకటి జరిగిందని వాపోయారు.

మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కొందరు ప్రముఖులు జనసేన టికెట్ ఆశిస్తున్నారు. జనసేన తరపున అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో వారు నేరుగా టికెట్ అడక్కుండా.. ముందుగా పార్టీకి విరాళం ఇచ్చినట్లుగా చెక్కులు ఇస్తున్నారు. ఆ తర్వాత పలానా టికెట్ కావాలని పవన్ కల్యాణ్ ముందు ప్రపోజల్ పెడుతున్నారు. వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఇది వర్కవుట్ కాలేదు. విరాళం రూపంలో చెక్ లు ఇచ్చి టికెట్లు ఆశిస్తున్న వ్యక్తులపై పవన్ సీరియస్ అయ్యారు. వెంటనే వారి చెక్కులు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

‘‘పార్టీకి విరాళాలిచ్చాం.. మాకు టికెట్‌ ఇవ్వండి’’ అంటూ ఒత్తిడి తెచ్చేవారిని స‌హించేది లేద‌న్న సంకేతాలు ఇచ్చారు.  అధినేత ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయ సిబ్బంది చెక్కులు ఇచ్చిన వారికి ఫోన్లు చేసి, వాటిని తీసుకువెళ్లాలని కోరుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ నిర్ణయంతో విరాళాలు ఇచ్చిన ప్రముఖులు ఖంగుతిన్నారు. ప‌వ‌న్ నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. పార్టీకి విరాళాలు రావ‌డం క‌ష్టం అవుతుంద‌ని కొంద‌రు అంటుంటే.., ఈ నిర్ణ‌యంతో నేత‌ల్లో ఉత్సాహం త‌గ్గుతుంద‌ని మ‌రికొంద‌రు అభిప్రాయం ప‌డుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 4 =