ఏపీలో తొలి విడతలో రూ.140 కోట్లతో 4530 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం : సీఎం వైఎస్ జగన్

4530 Digital Libraries in the State in First Phase, Andhra Pradesh to have 4530 YSR digital libraries, Andhra Pradesh to set up 4530 digital libraries, Andhra Pradesh to set up digital libraries in 4530 gram, Andhra to set up 4530 digital libraries, AP CM directs officials to strengthen WFH concept, CM Jagan moots more tech muscle to boost work from home, CM YS Jagan, CM YS Jagan Ordered Officials to Built 4530 Digital Libraries, CM YS Jagan Ordered Officials to Built 4530 Digital Libraries in the State in First Phase, Mango News, YS Jagan directs officials to set up 4530 digital libraries, YSR digital libraries

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం నాడు ఐటీ శాఖ, డిజిటల్ లైబ్రరీలపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తొలి విడతలో భాగంగా 4,530 వైఎస్‌ఆర్‌ డిజిటల్‌ లైబ్రరీలను నిర్మించనున్నట్లు తెలిపారు. అందులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.140 కోట్లను వెచ్చించనున్నట్లు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, “ప్రతి గ్రామ పంచాయతీలోనూ డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేయాలి. మొదటి విడత లైబ్రరీల నిర్మాణ పనులను ఆగస్టు 15న ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలి. కనీస సదుపాయాలతో పాటు మూడు డెస్క్‌టాప్‌లు, యూపీఎస్‌, డెస్క్‌టాప్‌ బార్‌కోడ్‌ ప్రింటర్‌, స్కానర్‌, లేజర్‌ ప్రింటర్‌, సాఫ్ట్‌వేర్‌, యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌, అన్‌లిమిటెడ్‌ బ్యాండ్‌విడ్త్‌ ఇంటర్నెట్‌ ఉండాలి. స్టోరేజీకి సంబంధించి డేటా సెంటర్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి” అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ప్రైమరీ, సెకండరీ విద్యతోపాటు గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు ఈ డిజిటల్‌ లైబ్రరీలు ఉపయోగకరంగా ఉండాలని చెప్పారు. ఇందులో కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టులతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ ఉంచాలి. వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. గ్రామాలకు నిరంతర, నాణ్యమైన ఇంటర్నెట్‌ సేవలు అందించాలని సీఎం అధికారులకు నిర్దేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌, పంచాయతీరాజ్‌శాఖ కమిషనరు గిరిజా శంకర్‌, ఫైబర్‌నెట్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి, ఏపీటీఎస్‌ ఎండీ నంద కిషోర్‌ పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here