విశాఖ లేదా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి నారా బ్రాహ్మణి పోటీ

TDP, Nara Brahmani,Nara Brahmani in the election ring, Contest from Visakha, Contest from Vijayawada Parliament seat, TDP Election Campaign, Nara Lokesh, National Women's Parliament Conference, vijayawada, TDP elections, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News,AP Latest news and Updates
TDP, Nara Brahmani,Nara Brahmani in the election ring, Contest from Visakha, Contest from Vijayawada Parliament seat

ఏపీలో  పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటికే  అన్ని పార్టీలు ఎన్నికలపై కసరత్తులు ప్రారంభించాయి. వైసీపీని ఎలా అయినా గద్దె దించాలని అన్ని పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు  ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో పసుపు జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉన్నారు.

ఇదే ఆశయంతో పనిచేస్తున్న జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకొని ఈ సారి ఎన్నికల బరిలోకి దిగబోతుంది. ఇప్పటికే రెండు పార్టీల అధినేతలు లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ఎంపిక చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. ఈసారి తెలుగుదేశంలో  యువతకు ఛాన్స్ ఇవ్వడానికి  చూస్తుంది. దీనికోసం కొంతమంది సీనియర్ల పక్కన పెట్టి  మరీ..వారి స్థానాల్లో కొత్త వారయిన యువ నేతలకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా నారా బ్రాహ్మణికి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని భావిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినపుడు భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ప్రజలతో కలిసి  చాలా  కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో బ్రాహ్మణి ప్రసంగాలకు ప్రజల నుంచి మద్దతు బాగా కనిపించింది. దీంతోనే రాబోయే  ఎన్నికల్లో నారా బ్రాహ్మణితో పోటీ చేయించడం వల్ల  పార్టీకి కలిసి వస్తుందనే చర్చ పార్టీలో మొదలైంది.

ప్రస్తుతం  నారా బ్రహ్మణి  హెరిటేజ్ బాధ్యతలను చూసుకుంటున్నారు. భువనేశ్వరితో కలిసి బ్రాహ్మణి కూడా బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నారు. ఈ సమయంలో బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై  ఆసక్తి చూపుతారా అనే వాదన పార్టీలో వినిపిస్తోంది. అయితే, పార్టీలో బలమైన నాయకత్వంతో పాటు.. ఎన్టీఆర్ వారసులను తీసుకువచ్చి పార్టీలో బాధ్యతలు పెంచడానికి చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే  బ్రాహ్మణిని టీడీపీలోకి తీసుకురావడానికి,  బ్రాహ్మణిని విశాఖ లేదా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయించే అంశంపై పార్టీలో జోరోగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 10 =