సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై స్పందించిన నారా లోకేష్.. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచన

Nara Lokesh Responds Over CM Jagan Delhi Tour Suggested To Demand Center Over Special Status For AP,Nara Lokesh Responds,CM Jagan Delhi Tour,Suggested To Demand Center,Over Special Status For AP,Mango News,Mango News Telugu,Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates,A.P. Political Parties List,A.P. Political Parties List,Andhra Pradesh Politics News,Ap Government And Politics,Ap News,Ap Political Map,Ap Politics And Government,Ap Politics Latest News,Ap Politics Latest Updates,Ap Politics Results,Ap Politics Today,Ap Politics Twitter,Latest Survey On Ap Politics,New Political Party In Andhra Pradesh,Political News Today

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ మేరకు ఆయన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ‘యువగళం’ పాదయాత్రలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారని, కానీ రాష్ట్రానికి సాధిస్తోంది మాత్రం ఏమీ లేదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. ఈ మూడేళ్ళలో విమానాల్లో ఢిల్లీ పర్యటనలు చేయడం తప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి కనీసం కేంద్రం వద్ద దాని గురించి ప్రస్తావించే సాహసం కూడా చేయలేకపోతున్నారని లోకేష్ తెలిపారు.

సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలపై తమకు అనుమానాలున్నాయని, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్న సందర్భంలో ఆయన కేంద్ర పెద్దలను కలవడంలో ఆంతర్యం ఏంటని నారా లోకేష్ ప్రశ్నించారు. సీఎం జగన్ రాష్ట్రానికి నిధులు కానీ, పెట్టుబడులు కానీ సాధించలేకపోతున్నారని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని యువతను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకపోతే.. జగన్ కు కానీ, లోకేష్ కి కానీ ఎలాంటి నష్టం వాటిల్లదని, కానీ రాష్ట్ర యువత భవిష్యత్ మాత్రం దెబ్బతింటుందని పేర్కొన్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలను తాము వ్యతిరేకించడం లేదని, అయితే ఆ పర్యటనల ద్వారా రాష్ట్రానికి ఏం సాధిస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన పైన ఉంటుందని లోకేష్ స్పష్టం చేశారు. ఇక టీడీపీ అధికారంలోకి వస్తే ఏపీలోని యువత ఉపాధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =