అమిత్ షాకు నారా లోకేష్ లేఖ, పది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల రద్దుపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

10th exams in ap 2021 latest news, Andhra Pradesh to conduct 10 and Intermediate exams, ap 10th class exam time table 2021, ap 10th class exams 2021 updates, AP To Conduct Class X And XI Exams Amid COVID-19, COVID-19, Inter 1st Year Exams, Mango News, Nara Lokesh, Nara Lokesh Slams YS Jagan Mohan Reddy, Nara Lokesh Writes Letter to Amit Shah, Postpone 10th and Inter Exams, SSC exams, Urged to Interfere to Cancel the 10th, YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన లేఖను జత చేస్తూ ట్వీట్ చేశారు. “రాష్ట్రంలో పది, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకు కేంద్రం జోక్యం కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసాను. దేశంలోని దాదాపు 14 రాష్ట్రాలతో పాటు ఐసిఎస్‌ఈ, సిబిఎస్‌ఈ బోర్డులు పరీక్షలు రద్దు చేశాయి. ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చర్యలు ఉన్నాయి. జూన్ 7 నుంచి వేలాది పరీక్షా కేంద్రాల్లో 6.7 లక్షల మంది విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 5 లక్షలకు పైగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు తమ పరీక్షల పట్ల అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు” అని నారా లోకేష్ అన్నారు.

“ఈ రెండు తరగతుల విద్యార్థులు ఎంతో మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. అనవసరంగా మరింత మందిని కరోనా రెండో దశ ఉధృతికి పరీక్షల వంకతో పణంగా పెట్టడం తగదు. పరీక్షల నిర్వహణతో విద్యార్థులను సూపర్‌స్ప్రెడర్ లుగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. పది, ఇంటర్ పరీక్షల విషయంలో సిబిఎస్ఈ అనుసరిస్తున్న విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసేలా చర్యలు తీసుకోమని కోరాను. ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల ఆందోళనలను గమనించి విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలి” అని నారా లోకేష్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 5 =