చెడు కలలకు చెక్ పెట్టే డెకరేటివ్ పీస్

Dream Catchers Checks Bad Dreams, Checks Bad Dreams, Bad Dreams Catchers, Dream Checks, Dream Catcher Uses, Dream Catchers, A Decorative Piece That Checks Bad Dreams, Latest Bad Dream Catchers News, Bad Dream Catchers News Update, Healthy Sleep, Health News, Nightmares, Bad Dreams, Mango News, Mango News Telugu
Dream Catcher Uses ,dream catchers,A decorative piece that checks bad dreams, dream catcher checks bad dream

పడుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కలలు కనడం సహజమే. అయితే వీటిలో కొన్ని కలలు సంతోషాన్నిచ్చేవిగా.. ఆ కలతోనే ఆ రోజును హ్యాపీగా గడిపేలా చేస్తాయి. కానీ కొన్ని కలలు మాత్రం నిద్రను చెడగొట్టడమే కాదు..ఆరోజు అంతా మనస్సాంతి లేకుండా చేస్తాయి. ఇలా కొన్ని కలలు మన డే ను డిసైడ్ చేసేలా ఉంటాయి.

మంచి కలలు వస్తే ఓకే.. మరి చెడు కలలు రాకుండా ఏం చేయాలో కూడా నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో డ్రీమ్ క్యాచర్ ఒక డెకరేటివ్ పీస్‌లా కనిపిస్తూనే ఉంది. కొంతమంది హ్యాంగింగ్స్‌లా బాగుందని కొంటే.. మరికొందరు చెడు కలలకు వీటితో చెక్ పెట్టడానికి కొంటూ ఉంటారు. కానీ దీనిని అస్సలు లైట్ తీసుకోవద్దని.. చైనీస్ వాస్తు శాస్త్రం చెబుతోంది.

నిజానికి ఈ డ్రీమ్ క్యాచర్‌లు చాలా అందంగా కనిపిస్తాయి.  కలర్ ఫు‌ల్‌లా కనిపిస్తూ అందమైన పక్షి ఈకలతో  డెకరేట్ చేస్తూ కనిపించే ఈ డ్రీమ్ క్యాచర్స్‌ను చూడగానే వావ్ భలే ఉన్నాయే అన్పిస్తాయి.  చూడగానే ఆకర్షణీయంగా ఉండటంతో ఈ డ్రీమ్ క్యాచర్లను ఇంటి అలంకరణ కోసం చాలామంది  ఉపయోగిస్తారు. చైనా వాస్తు శాస్త్రమైన ఫెంగ్ షుయ్‌లో మాత్రం ఈ డ్రీమ్ క్యాచర్స్‌ వల్ల  చాలా ప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఫెంగ్ షుయ్ చెబుతున్నదాని  ప్రకారం  ఇంటిలో డ్రీమ్ క్యాచర్‌ను పెడితే ఆ  ఇంటిలో ప్రతికూల శక్తుల ప్రభావాన్ని తగ్గిస్తుందట. అంతేకాదు.. సానుకూల శక్తి ప్రసరణను పెంచుతుందట. అలాగే తరచూ  చెడు కలలు, భయంకరమైన పీడ కలలు కంటున్నవాళ్ల తమ  ఇంటిలో డ్రీమ్ క్యాచర్‌ను తగిలించాలి. ఇలా చేస్తే చెడు కలలను దూరం చేసుకోవచ్చని చైనా వాస్తు శాస్త్రం చెబుతోంది.

చైనీస్ వాస్తు శాస్త్రం చెబుతున్న దాని ప్రకారం.. డ్రీమ్‌క్యాచర్‌లు ఉంటే  ఆ ఇంటికి ఉన్న వాస్తు దోషం కూడా తొలగిపోతుందట. వాస్తు దోషాన్ని తొలగించడంలో డ్రీమ్‌క్యాచర్ మొదటి ప్లేసులో ఉంటుంది.  వాస్తు బాగుంటేనే ఎవరికైనా సంతోషం, ఐశ్వర్యం వస్తాయి. అయితే వీటిని  సరైన దిశలో ఉంచినట్లయితే.. మరిన్ని ప్రయోజనాలను పొందొచ్చట.

ఫెంగ్ షుయ్ చెబుతున్నదాని  ప్రకారం, డ్రీమ్ క్యాచర్‌ను ఉంచడానికి ఉత్తమ దిశ.. నైరుతి.  అంటే ఇంటి దక్షిణ మరియు పడమర దిశలో నైరుతి ఉంటుంది. అంతే కాదు దీనిని పిల్లల పడకగదిలో పెడితే మంచిదట. కానీ డ్రీమ్‌క్యాచర్‌లను వంటగదిలో లేదా బాత్రూంలో మాత్రం  ఎప్పుడూ ఉంచకూడదట. ఇలా చేయడం వల్ల, డ్రీమ్‌క్యాచర్ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చైనీస్ వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 11 =