ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, వీరేంద్ర హెగ్డే, పీటీ ఉషాలకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

Pawan Kalyan Greetings to Ilayaraja Vijayendra Prasad Virendra Hegde PT Usha for Nominated to Rajya Sabha, Pawan Kalyan Greetings to PT Usha for Nominated to Rajya Sabha, Pawan Kalyan Greetings to Ilayaraja for Nominated to Rajya Sabha, Pawan Kalyan Greetings to Virendra Hegde for Nominated to Rajya Sabha, Pawan Kalyan Greetings to Vijayendra Prasad for Nominated to Rajya Sabha, Nominated to Rajya Sabha, Pawan Kalyan Greetings, Pawan Kalyan Wishes, Janasena Party Chief Pawan Kalyan Greetings, Janasena Party President Pawan Kalyan Wishes, Rajya Sabha Nominations News, Rajya Sabha Nominations Latest News. Rajya Sabha Nominations Latest Updates, Rajya Sabha Nominations Live Updates, Mango News, Mango News Telugu,

ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్‌, ప్రముఖ సంగీత దిగ్గజం ఇళయరాజా, ప్రముఖ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉషా, సామాజిక సేవకుడు హెగ్డే లను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, వీరేంద్ర హెగ్డే, పీటీ ఉషాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “శ్రీ ఇళయరాజా, రాజ్యసభ..అంటే పెద్దల సభకు శ్రీ ఇళయ రాజా, శ్రీ విజయేంద్ర ప్రసాద్, శ్రీ వీరేంద్ర హెగ్గడే, శ్రీమతి పి.టి.ఉష సభ్యులుగా నియమితులయ్యారనే వార్త ఎంతో ఆనందాన్ని కలిగించింది. రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయిన వీరికి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను” అని అన్నారు.

“స్వర జ్ఞాని ఇళయరాజా, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, సామాజిక సేవకులు వీరేంద్ర హెగ్గడే, పరుగుల రాణి పీటీ ఉషా తమ రంగాల్లో మన దేశ పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేసిన స్రష్టలు. వీరి సేవలు, అనుభవాన్ని సముచితరీతిన గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర నాయకత్వానికి అభినందనలు తెలియచేస్తున్నాను. పదవులు ఇవ్వాలంటే రాజకీయంగా ఎంత లబ్ది కలుగుతుంది?, ఎన్ని కోట్లు మన ఇంట్లోకి వచ్చి చేరతాయి అని కొన్ని పార్టీల అధినాయకులు లెక్కలు వేసుకుని ముక్కు ముఖం తెలియని వారికి పెద్ద పదవులు కట్టబెట్టడం జగమెరిగిన సత్యం. ఇటువంటి ఈ కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని మనసారా స్వాగతిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here