నాపై, నా సిబ్బందిపై దాడికి ప్రయత్నించారన్న పవన్

Pawan Said They Tried To Attack Me And My Staff, They Tried To Attack Me Said Pawan, Pawan Said They Attack Me, Thin Blade, YSRCP, TDP, Jana Sena, BJP, Congress, Chandrababu, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
thin blade,Pawan said they tried to attack me, YSRCP, TDP, Jana Sena, BJP, Congress, Chandrababu,

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల్లో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారంలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కిరాయిమూకలు సన్నని బ్లేడ్‌తో తనను, తన వ్యక్తిగత సిబ్బందిపై దాడి చేసి కట్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

తనకోసం  వస్తున్నవాళ్లు అంతా  జాగ్రత్తగా ఉండాలని..భారీగా జనాలు  ఉన్నప్పుడు కొంతమంది కిరాయి మూకలు సన్న బ్లేడ్లుతో తిరుగుతున్నారని.. దానితో తనను, తన  సెక్యూరిటీని కూడా కట్ చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇలాంటి ఆరోపణలు గతంలోనూ  చేశారు. అమలాపురం పర్యటనలో ఉన్నప్పుడు.. తనను అంతమెుందించడానికి వైసీపీ 2వేల మంది కిరాయి మూకలను దించిందని పవన్ ఆరోపణలు చేశారు. తాజాగా మరోసారి  బ్లేడ్‌ బ్యాచ్ తిరుగుతుందన్న ఆరోపణలు రాజకీయంగా ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఇక జనసేన పార్టీ అధినేత పవన్ .. మార్చి 30 నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన  కొనసాగుతుండగా..సోమవారం వివిధ పార్టీలకు చెందిన నేతలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేనానితో ఫోటోలు దిగేందుకు జనసేన పార్టీ కార్యకర్తలు, సామాన్యులు పోటెత్తారు.దీంతో వీరందరి కోరిక తీర్చడం కోసం ప్రతీరోజూ తన అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఫోటో సెషన్ ఒకటి పెడతామని చెప్పారు. అలాగే  అధికార పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనమంతా జాగ్రత్తగా ఉండాలని వారికి సూచించారు.

ఇప్పుడు కొన్ని విషయాలలో మనం ప్రొటోకాల్ పాటించాల్సిందేనని..ఒక్కోసారి ప్రోటోకాల్ పాటించకపోతే సమస్యలు వస్తాయన్న పవన్..ఎందుకలా అనాల్సి వచ్చిందో కారణం వివరించారు. పిఠాపురంలోనే కొంతమంది బ్లేడుతో తనను గాయపరిచారని..అందుకే తాను అందరినీ కలవలేకపోతున్నానని అన్నారు. మొత్తంగా పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మరోవైపు పవన్ వ్యాఖ్యలపై అధికార వైసీపీ నేతలు కౌంటర్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =