చంద్రబాబు స్కెచ్‌తో మొత్తం మారిపోయిందిగా!

A Shock For The Janasena Aspirants In Avanigadda?, A Shock For The Janasena, Janasena Aspirants In Avanigadda, Avanigadda Janasena Aspirants, Janasena Aspirants, Avanigadda, Shock For The Janasena, Avanigadda Politics, Mandali Buddha Prasad, Avanigadda, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
avanigadda politics mandali buddha prasad likely to get ticket telugu news

పొత్తులో భాగంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేనకు రెండు అసెంబ్లీ సీట్లు ఇస్తారని ముందు నుంచి ప్రచారం జరిగింది. అందులో ఒకటి విజయవాడ వెస్ట్.. రెండోది అవనిగడ్డ. విజయవాడ వెస్ట్‌ బీజేపీ పట్టుకుపోయింది. ఈ సీటు తనకే దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన పోతిన మహేశ్‌కు నిరాశే మిగిలింది. అనూహ్యంగా సుజనా చౌదరి పేరును విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా కూటమి ప్రకటించింది. ఇప్పటివరకు ప్రత్యేక్ష రాజకీయాల్లో సుజనా చౌదరి పాల్గొన్నది లేదు. ఆయన్ను చంద్రబాబు ఫ్రెండ్‌గానే ప్రజలు చూస్తారు. నాడు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఆయనకు టికెట్ ఇవ్వడం వెనుక చంద్రబాబు లాబీయింగ్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు అవనిగడ్డ సీటుపైనా చంద్రబాబు కన్నేశారని తాజా పరిణామాలను చూసిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదేం ట్విస్ట్‌రా బాబు:

మండలి బుద్ధప్రసాద్‌ అవనిగడ్డ నుంచి టికెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ టికెట్ జనసేనకు వెళ్తుందని తెలిసిన నాటి నుంచి ఆయన అలకబూనారు. ఇదే సమయంలో అవనిగడ్డ టికెట్ కోసం జనసేన నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటి పడ్డారు. బండ్రెడ్డి రామకృష్ణ, చిక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణలలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నదానిపై జనసేన ఫోన్‌ సర్వేలు కూడా చేసింది. సర్వే పూర్తయ్యే సమయానికి మండలి బుద్ధ ప్రసాద్‌ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆయన జనసేనలో చేరారు.        అవనిగడ్డ టికెట్‌ ఆయనకేనని తెలుస్తోంది. ఇది జనసేన అభ్యర్థులను షాక్‌కు గురి చేసింది.

నిరసనల పర్వం:

అవనిగడ్డ సీటు గాజు గ్లాసుకి ఇస్తే ఓడిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన టీడీపీ నేతలు ఇప్పడు పవన్‌ పార్టీలో ఎలా చేరారని బుద్ధ ప్రసాద్‌పై జనసైనికులు మండిపడుతున్నారు. బుద్ధ ప్రసాద్‌కు టిక్కెట్ ఇస్తే అవనిగడ్డలో జనసైనికుమంతా రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నిజానికి మండలి బుద్ధప్రసాద్‌ వర్గం చాలా రోజులుగా జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడుతోంది. జనసేను అవనిగడ్డ సీటు ఇస్తే చంద్రబాబు నష్టపోతారని అటు సోషల్‌మీడియాలో ఇటు నియోజకవర్గంలోనూ ప్రచారం చేసింది. ఇది జనసైనికుల ఆగ్రహానికి  కారణమైంది. మండలి బుద్ధ ప్రసాద్‌ తన పద్ధతి మార్చుకోవాలని బహిరంగంగానే జనసేన కార్యకర్తలు విమర్శలు గుప్పించారు. అయితే చంద్రబాబు మాత్రం మండలిని బుజ్జగించేందుకు ఏకంగా పార్టీ మారమని  చెప్పినట్టుగా తెలుస్తోంది. మండలి బుద్ధప్రసాద్‌ను జనసేన నుంచి పోటి చేయిస్తే పవన్‌కు కేటాయించిన సీట్ల సంఖ్య కూడా తగ్గదన్నది చంద్రబాబు ప్లాన్‌గా అర్థమవుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =