నేడు తొలి జాబితా !

First List Today!, AP State Elections , TDP , YSRCP , Janasena, First List, AP First List Today, AP Congress First List, Congress First List, Congress List, Sharmila, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
First list today , AP State Elections , TDP , YSRCP , Janasena

విభ‌జ‌న అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉనికి కోల్పోయిన పార్టీ కాంగ్రెస్‌. తెలంగాణ ప్ర‌క‌ట‌న‌తో ఏపీలో కాంగ్రెస్ తీవ్రంగా న‌ష్ట‌పోయింది. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీలో ఉండ‌డానికే వెనుక‌డుగు వేసిన ప‌రిస్థితులు.  విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోనూ ప్ర‌భావం శూన్యం. ఇటీవ‌ల ఏపీసీసీ చీప్ గా ష‌ర్మిల బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం కాంగ్రెస్ పేరు ఏపీలో మ‌ళ్లీ మార్మోగుతోంది. ష‌ర్మిల రాష్ట్రమంతా తిరుగుతూ, అన్న పార్టీకి స‌వాల్ విసురుతూ.. ప్ర‌చారంలో ఆక‌ట్టుకుంటున్నారు. దీంతో అధికార పార్టీ కి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు.. రానున్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆశావ‌హులు ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని ష‌ర్మిల పిలుపునివ్వ‌గా, భారీ స్పంద‌న వ‌చ్చింది.

ఈనేప‌థ్యంలో అభ్య‌ర్థుల ఎంపిక‌పై పార్టీ తీవ్ర‌మైన క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈమేర‌కు ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల ఢిల్లీలో సుదీర్ఘ క‌స‌ర‌త్తు చేశారు. అన్నీ ఓకే అయితే.. 100 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీ అబ్య‌ర్థుల‌తో కాంగ్రెస్ తొలిజాబితా నేడు విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. కాగా.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పార్లమెంటు ఎన్నికల బరిలోకి  దిగనున్నట్టు తెలిసింది. వైఎస్‌ కుటుంబానికి కంచుకోట వంటి కడప పార్లమెంటు స్థానం నుంచి ఆమె కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థురాలిగా పోటీ చేయనున్నట్టు ఏపీసీసీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో షర్మిల పేరును కూడా చేర్చారు. ఈ జాబితాను  ఏఐసీసీ కేంద్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి శనివారం స్వయంగా షర్మిల పంపించారు.

కాంగ్రెస్‌ పార్టీ తరుఫున అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రాష్ట్ర స్థాయి నాయకత్వం ఇప్పటికే ఖరారు చేసింది. సుమారు 1500 మంది పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. వీరిలో అర్హత, సామాజిక సమీకరణలు, ప్రత్యర్థులను అన్ని విధాలా తట్టుకుని నిలబడగలిగే సత్తా వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఆయా అభ్యర్థుల జాబితాలను నియోజకవర్గాల వారీగా సిద్ధం చేసి ఏఐసీసీకి పంపారు. ఈ జాబితాలోనే కడప లోక్‌సభ అభ్యర్థిగా షర్మిల పేరు ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, కాంగ్రెస్‌ రాష్ట్ర అభ్యర్థుల జాబితాను నేడు, లేదా ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే వీలుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 10 =