11 ఏళ్ల చిన్నారికి గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

11 Year Old Child Undergoes Heart Transplant Surgery Successfully, 11 Year Old Child Undergoes Heart Transplant, Child Undergoes Heart Transplant Surgery, 11 Year Old Child Heart Transplant Surgery, Child Heart Transplant Surgery, Heart Transplant Surgery, Heart Surgery, Tirupathi, Sri Padmavathi Hrudayalaya, Latest 11 Year Old Child Heart Transplant Surgery News, Child Heart Transplant Surgery Latest News, Health News, Health Tips, Latest Health News, Mango News, Mango News English
heart transplant surgery, heart surgery, Tirupathi, Sri padmavathi Hrudayalaya

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్దీ వైద్య రంగంలో అనేక మార్పులొస్తున్నాయి. అన్ని రాకల రోగాలకు అత్యాధునిక టెక్నాలజీతో చికిత్స అందిస్తున్నారు. ఇటీవలకాలంలో టెక్నాలజీ సాయంతో వైద్యులు గుండెమార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేస్తున్నారు. తిరుపతిలోని శ్రీపద్మావతి హృదయాలయంలో ఇప్పటి వరకు తొమ్మిది మంది చిన్నారులకు వైద్యులు గుండెమార్పిడి చికిత్స చేశారు. ఇప్పుడు మరో చిన్నారికి గుండెమార్పిడి చికిత్సను విజయవంతంగా చేసి రికార్డ్ సృష్టించారు. 50 ఏళ్ల వ్యక్తి గుండెను 11 ఏళ్ల చిన్నారికి అమర్చారు.

రంగారెడ్డి జిల్లా వనస్థలిపురానికి చెందిన 11 ఏళ్ల చిన్నారి లహరి కొద్దిరోజులుగా గుండె సంబంధిత సమస్యతో సతమతమవుతోంది. ఇటీవల లహరిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు గుండెమార్పిడి అవసరమని గుర్తించారు. ఈక్రమంలో లహరి పేరును తల్లిందండ్రులు జీవన్ దాన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తికి బ్రెయిన్ డెడ్ కావడంతో.. కుటుంబ సభ్యులు అతని అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈక్రమంలో ఆ వ్యక్తి గుండెను వైద్యులు శ్రీకాకుళంలోని జేంస్ ఆసుపత్రిలో సేకరించారు. అనంతరం గుండెను బాక్సులో పెట్టి హెలికాప్టర్‌లో ఆసుపత్రి నుంచి విశాఖకు తరలించారు. అక్కడి నుంచి విమానంలో తిరుపతికి తీసుకెళ్లారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆపరేషన్ థియేటర్‌లో సిద్ధంగా ఉన్న వైద్యులు.. చిన్నారి లహరికి విజయవంతంగా గుండెను అమర్చారు. లహరి గుండె మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమయిందని వైద్యులు ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి తిరుపతికి గుండెను తరలించడానికి 3 గంటల సమయం పట్టిందని వెల్లడించారు. తాజా ఆపరేషన్‌తో శ్రీపద్మావతి హృదయాలయంలో చేసిన గుండెమార్పిడి ఆపరేషన్ల సంఖ్య పదికి చేరుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + two =