క్రైస్తవులకు అండగా పెమ్మసాని..

Pemmasani chandrasekhar, Guntur, lok sabha elections, Guntur tdp mp candidate,tdp,lok sabha,Christians,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,andhra pradesh,Mango News Telugu,Mango News
Pemmasani chandrasekhar, Guntur, lok sabha elections, Guntur tdp mp candidate

గుంటూరులో జెట్ స్పీడ్‌తో ప్రచారాలు నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. కులమత బేధాలు లేకుండా అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ వెళ్తున్నారు. ప్రజాదరణ పెంచుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఆపదలో ఉన్నవారికి నేనున్నాననే అభయమిస్తున్నారు. పెమ్మసానిలోని సేవా గుణం, ప్రజలకు మంచి చేయాలనే తపన చూసి ప్రజలు అడుగడుగునా ఆయనకు నీరాజనాలు పలుకుతున్నారు. స్వచ్ఛందంగా వేలాది మంది తరలివచ్చి పెమ్మసానికి స్వాగతం పలుకుతున్నారు. తమ మద్ధతు తెలియజేస్తున్నారు.

కొద్దిరోజులుగా గుంటూరు ప్రజలకు పెమ్మసాని చంద్రశేఖర్ దగ్గరగా ఉంటున్నారు. ఓవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు గుంటూరు పరిధిలో జరుగుతున్న పలు కార్యక్రమాలకు పెమ్మసాని  హాజరవుతున్నారు. ఇటీవల ఓ కాలేజీ ఫంక్షన్‌కు హాజరై విద్యార్థులకు పలు విలువైన సలహాలు, సూచనలు చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నప్పటికీ.. సమయం, సందర్భాణుసారంగా నడుచుకుంటూ పెమ్మసాని అందరి మెప్పు పొందుతున్నారు. తాజాగా హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న గుడారాల పండుగకు పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు.

1977లో కేవలం 80 మందితో గుడారాల పండుగ మొదలయింది. ఇప్పుడు ఆ పండుగకు నాలుగు లక్షల మందికి పైగా క్రైస్తవ సోదరసోదరీమణులు హాజరవుతున్నారు. దీని వెనుక ఏసుక్రీస్తు ఆశీస్సులు ఉన్నాయని.. దీనిని బలపరిచిన హోసన్న మినిస్ట్రీస్ పాస్టర్లను అభినందిస్తున్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. తన జీవితంలో తాను చూసిన పెద్ద పండుగ ఇదేనని చెప్పారు. శాంతి, ప్రేమ పంచడానికే ఏసుక్రీస్తు జన్మించారని.. ఆయన మార్గంలో నడవాలని సూచించారు. ఏసుక్రీస్తు ఆశీర్వాదం పొంది అందరూ ఆనందంగా జీవించాలని పెమ్మసాని ఆకాంక్షించారు.

ఎంతో మంది క్రైస్తవసోదర, సోదరీమణులు పేదరికంతో ఇబ్బందులు పడుతున్నారని.. ఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా అవమాణాలకు గురవుతున్నారని అన్నారు. ఇకపై క్రైస్తవ సోదరసోదరీమణుల స్వేచ్ఛకు, హక్కులకు భంగం కలిగితే సహించేది లేదనన్నారు. వారికోసం ఎంత దూరమైనా వెళ్లి.. ఎవరితోనైనా పోరాడుతామని వెల్లడించారు. క్రైస్తవులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని.. వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అయితే తమ కోసం.. తమ అభివృద్ధి కోసం పెమ్మసాని చంద్రశేఖర్ ముందుకు కదిలొస్తుండడంతో.. క్రైస్తవ సోదర సోదరీమణులు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − five =