సెక్రటేరియట్ నిర్మాణ పనులు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

CM KCR Held Review On R And B Irrigation Departments At Pragati Bhavan, CM KCR, Review On R And B Irrigation Departments, Pragati Bhavan, Pragati Bhavan Live News, Pragati Bhavan Live Updates, Telangana CM KCR, B Irrigation, R Irrigation, Irrigation Department, Pragati Bhavan Latest Updates, Mango News, Mango News Telugu, Telangana irrigation department, Kcr review on irrigation department,

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం నాడు ప్రగతి భవన్ లో రోడ్లు భవనాలు, ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు. ముందుగా నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతున్న రాష్ట్ర సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ముఖ్యమైన పనులతో పాటు, ల్యాండ్ స్కేపింగ్, సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన రక్షణ వ్యవస్థ, తదితర అనుబంధ భవనాల నిర్మాణ పనుల వేగాన్ని కూడా సమాంతరంగా పెంచాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం సూచించారు. సచివాలయానికి పటిష్టమైన భధ్రతా చర్యలు తీసుకుంటున్ననేపథ్యంలో పోలీసు వారికి కావాల్సిన వసతులు తదితర అంశాల గురించి డిజిపి మహేందర్ రెడ్డితో సంప్రదించి చర్యలు చేపట్టాలన్నారు. 24 గంటల నిఘా కోసం అధునాతన సాంకేతికతతో పోలీసు కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష:

రాష్ట్రంలో నడుస్తున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం ఈ సందర్భంగా సమీక్షించారు. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులకు సీఎం పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్ ల అనుమతుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. కేంద్ర జల సంఘం వారు కోరుతున్న అన్ని వివరాలను, అదనపు సమాచారాన్ని సమర్పించి త్వరితగతిన అనుమతులు పొందాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీతారామ, సమక్కసాగర్, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతలు, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతలు, మోడికుంట వాగు ప్రాజెక్టుల డిపిఆర్ లు సమర్పించి 5 నెలలు గడిచినా కేంద్ర జల సంఘం నుంచి ఇంకా అనుమతులు రాకపోవడం పట్ల సీఎం అసహనం వ్యక్తం చేశారు. డా. బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు డిపిఆర్ ను త్వరితగతిన సిద్ధం చేసి కేంద్ర జలసంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించాలని సీఎం ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

గోదావరి బోర్డు అధికారులతో కూడా నిరంతరం సంప్రదింపులు జరిపి 5 గోదావరి ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్ నుంచి తొలగించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర జల సంఘంకు పంపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సాగునీటి శాఖలో ప్రస్తుత సంవత్సరంలో ముఖ్యమైన ప్రాజెక్టుల టెండర్లు పిలవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువపై నిర్మించ తలపెట్టిన లిఫ్టు పథకాలు, గట్టు ఎత్తిపోతల పథకం, కామారెడ్డి మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాలెన్స్ పనులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయిన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పనులు, డా.బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించే బ్యారేజి, చెన్నూర్ ఎత్తిపోతల పథకం, కడెం నదిపై నిర్మించ తలపెట్టిన కుప్టి ప్రాజెక్టులకు టెండర్లు పిలువాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించిన ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణాలు సంపూర్ణమౌతాయన్నారు. సాగునీటి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రతిపాదిత లక్ష్యాలను చేరుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =