పండుగల సమయంలో నడిచే స్పెషల్ రైళ్ల జాబితా ఇదే …

10 Festival Special Trains, Dasara 2020 Special Trains, Dasara 2020 Special Trains Between AP and Telangana, Dussehra festival, Dussehra Special Trains, Dussehra special trains have started, Dussehra Special Trains To Run In Two Telugu States, Indian Railways, Indian Railways News, South Central Railway

కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిలిచిపోయిన రైలు సేవలను కేంద్రం దశలవారీగా ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దసరా, దీపావళి పండుగలు దగ్గరకొస్తుండడంతో మరికొన్ని రైళ్లు నడిపేందుకు అన్ని జోన్లకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీ డిమాండ్‌ ను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే 10 స్పెషల్ రైళ్లను నడిపేందుకు సిద్దమయింది. ఈ పండుగ స్పెషల్ రైళ్లు రెండువైపులా నడనున్నాయి.

అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 30 వరకు రోజూ నడిచే రైళ్ల వివరాలు:

లింగంపల్లి-కాకినాడ స్పెషల్ ట్రైన్: (బేగంపేట, సికింద్రాబాద్, భువనగిరి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి మీదుగా నడుస్తాయి)

లింగంపల్లి–తిరుపతి స్పెషల్ ట్రైన్: (బేగంపేట, సికింద్రాబాద్, బీబీనగర్, నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా నడుస్తాయి)

అక్టోబర్‌ 22 నుంచి నవంబర్‌ 30 వరకు(ప్రతి రోజూ) తిరుపతి–అమరావతి (మహారాష్ట్ర): (పాకాల, మదనపల్లి, కదిరి, ధర్మవరం, అనంతపురం, కర్నూలు, గద్వాల, మహబూబ్‌నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్‌, నాందేడ్, హింగోలి, వాసీం, అకోలా స్టేషన్ల మీదుగా నడుస్తాయి)

అక్టోబర్‌ 23 నుంచి నవంబర్‌ 30 వరకు (ప్రతి రోజూ) లింగంపల్లి–నర్సాపూర్ స్పెషల్ ట్రైన్‌: (బేగంపేట, సికింద్రాబాద్, నల్గొండ, విజయవాడ, గుడివాడ, భీమవరం, పాలకొల్లు స్టేషన్ల మీదుగా నడుస్తాయి)

అక్టోబర్ 21 నుంచి నవంబర్‌ 30 వరకు (ప్రతి రోజూ) విజయవాడ -హుబ్లీ స్పెషల్ ట్రైన్: (గుంటూరు, నర్సారావు పేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, కుంభం, గిద్దలూరు, నంద్యాల, డోన్, పేండేకల్, గుంతకల్, బళ్లారి, తోరంగల్లు, హొస్పెట్, మునిరాబాద్, కొప్పల్, గదగ్, అన్నిగిరి స్టేషన్ల మీదుగా నడుస్తాయి)

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =