హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు, స్కూల్ పిల్లలు సహా 16 మంది దుర్మరణం

16 Including School Children Lost Lives as Bus Falls into Gorge at Himachal Pradesh, Bus Falls into Gorge at Himachal Pradesh, 16 Including School Children Lost Lives, Sixteen Killed Including School Children Lost Lives as Bus Falls into Gorge at Himachal Pradesh, School Children Lost Lives as Bus Falls into Gorge at Himachal Pradesh, 16 passengers including some school children were killed as a private bus fell into a gorge in Himachal Pradesh, A private bus fell into a gorge in Himachal Pradesh Kullu district, Himachal Pradesh Kullu bus accident, School Children, Bus Falls into Gorge, Himachal Pradesh Kullu bus accident News, Himachal Pradesh Kullu bus accident Latest News, Himachal Pradesh Kullu bus accident Latest Updates, Himachal Pradesh Kullu bus accident Live Updates, Mango News, Mango News Telugu,

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కులూ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు. కాగా ప్రమాదం ధాటికి బస్సు నుజ్జునుజ్జు అయింది. అయితే మృతుల్లో స్కూల్ కు వెళ్తున్న చిన్నారులు కూడా ఉండటం విషాదం. సోమవారం తెల్లవారుజామున కులులోని సైన్జ్ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో బస్సు జంగ్లా గ్రామ సమీపంలో ఒక మలుపు వద్ద అదుపు తప్పి కొండపై నుంచి లోయలో పడింది. అయితే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని సహాయ చర్యలను ప్రారంభించారు.

ప్రమాదం ధాటికి బస్సు తీవ్రంగా దెబ్బ తినడంతో.. అధికారులు ముందుగా క్షతగాత్రులను గుర్తించి వారిని బయటకు తీసి, హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో 16 మంది మరణించారని, వీరిలో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉన్నారని కులు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నారని, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం వారిని జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలిస్తున్నామని వారు పేర్కొన్నారు. అయితే ప్రమాదం జరిగిన ప్రదేశం జిల్లా కేంద్రానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘటనా స్థలంలో సహాకయ చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =