జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ అవకాశం వీరికే…

3 Categories of People who can Use Postal Ballot in GHMC Elections, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, GHMC Nominations, Greater Hyderabad Municipal Corporation, Mango News, Postal Ballot in GHMC Elections, Telangana SEC, Telangana SEC Announces 3 Categories of People

ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో కొంతమందికి పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇలా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యానికి అర్హులైన ఓటర్లంతా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ www.tse.gov.in లోని “పోస్టల్ బ్యాలెట్ మేనేజ్ మెంట్ మాడ్యూల్” ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్ లేదా డిప్యూటీ కమిషనర్ దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి అడ్రస్ కు పోస్ట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ను పంపిస్తారని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ అవకాశం వీరికే:

  • 80 సంవత్సరాలు లేదా అంతకంటే వయస్సు ఎక్కువగల వృద్దులకు
  • వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులు (పీడబ్య్లుడీ)
  • నవంబర్ 1, 2020 తరువాత కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిన వారు

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + four =