మహారాష్ట్రలో మే 1 వరకు 144 సెక్షన్ అమలు, లాక్‌డౌన్‌ తరహా ఆంక్షల విధింపు

15-day janta curfew in Maharashtra, anta Curfew In Wake Of COVID-19 Rise, CM Uddhav Thackeray Announces Lockdown-like Restrictions, COVID-19 surge, Janata curfew imposed in THIS city of Maharashtra, Janta Curfew In Maharashtra, Janta Curfew In Maharashtra from 8 PM Today, Lockdown in Maharashtra, Maharashtra Cm Imposed 144 Section for 15 Days, Maharashtra Coronavirus, Maharashtra Coronavirus Lockdown, Maharashtra Coronavirus Lockdown News, Maharashtra government, Maharashtra government imposes curfew, Maharashtra Government Imposes Janta Curfew, Maharashtra lockdown news live, Mango News, Uddhav Thackeray announces strict janta curfew

రాష్ట్రంలో రోజువారీగా వేలసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మంగళవారం నాడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడం లేదని, అయితే లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను అమల్లోకి తెస్తున్నట్టు చెప్పారు. ఏప్రిల్ 14, బుధవారం రాత్రి 8 గంటల నుంచి మే 1 వరకు “మహా జనతా కర్ఫ్యూ” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటుగా 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. అలాగే 5,476 కోట్ల రూపాయలతో రిలీఫ్ ప్యాకేజీని కూడా సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో పేదలకు 3 కిలోల గోధుమలు, 2కిలోల బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. శివ భోజన్ తాలి పేరుతో 2 లక్షల మంది ప్రజలకు ఒక నెలకు ఉచితంగా ఆహారాన్ని అందించనున్నట్టు తెలిపారు. ఇక ఆటో డ్రైవర్లు, వీధివ్యాపారులకు, భవన నిర్మాణ కార్మికులకు రూ.1,500 ఆర్థికసాయం అందిస్తామన్నారు.

మహారాష్ట్రలో అనుమతి ఉన్న కార్యకలాపాలు ఇవే:

  • అత్యవసర సేవలు మరియు కార్యకలాపాలకు మినహాయింపు
  • వివాహాలకు 25 మందికి అనుమతి
  • అంత్యక్రియల విషయంలో 20 మందికి మాత్రమే అనుమతి
  • కిరాణా, కూరగాయల దుకాణాలు, పండ్ల దుకాణాలు, పాల పరిశ్రమలు, బేకరీలు
  • ప్రజా రవాణా – విమానాలు, రైళ్లు, టాక్సీలు (50% సామర్ధ్యం), ఆటో రిక్షా (డ్రైవర్+2), బస్సులు
  • పెట్రోల్ బంకులు, ఆర్‌బిఐ, సెబీతో సంబంధం ఉన్న ఆర్థిక సంస్థలు కార్యకలాపాలు
  • ఇ-కామర్స్ – అవసరమైన వస్తువులు, సేవల సరఫరా మాత్రమే

మహారాష్ట్ర 144 సెక్షన్‌ సమయంలో అనుమతి లేనివి:

  • సినిమా థియేటర్లు/మల్టిఫ్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మూసివేత
  • అన్ని పాఠశాలలు మరియు విద్యాసంస్థలు సహా ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ మూసివేత
  • రెస్టారెంట్లు, హోటల్స్, బార్‌లు మూసివేత, హోమ్ డెలివరీ సేవలకు మాత్రమే అనుమతి
  • స్పాస్,సెలూన్లు మరియు బ్యూటీ పార్లర్లు
  • సినిమా, సీరియల్స్, యాడ్ షూటింగ్స్ నిషేధం
  • మతపరమైన ప్రార్థనా స్థలాల్లో అనుమతిలేదు
  • అన్ని రాజకీయ కార్యకలాపాలు నిలిపివేత
  • బీచ్‌లు, ఉద్యానవనాలు, బహిరంగ ప్రదేశాలు మూసివేత
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =