గడప గపడకు ప్రభుత్వం తరహాలో ప్రతీ ఇంటికి టీడీపీ

TDP Chief Chandrababu Plans Kutumba Sarathi Program For Meet Every Household in AP,TDP Chief Chandrababu,Chandrababu Plans Kutumba Sarathi Program,Kutumba Sarathi Program For Meet Every Household,Every Household in AP,Mango News,Mango News Telugu,TDP, YCP, Chandrababu, Ys Jagan Mohan Reddy, Cm Jagan, TDP Leaders,TDP Chief Chandrababu Latest News,TDP Chief Chandrababu Latest Updates,TDP Chief Chandrababu Live News,Kutumba Sarathi Program Latest News,Kutumba Sarathi Program Latest Updates,Kutumba Sarathi Program Live Updates

సీఎం జగన్‌ను ఎలాగైనా ఓడించాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం. కానీ, ఒంటరిగా పోటీ చేయలేరు. సొంత ప్రచార తీరును నమ్ముకోవటం లేదు. దీంతో సీఎం జగన్ నిర్ణయాల బాటలోనే టీడీపీ అడుగులు వేస్తోంది. వైసీపీ అమలు చేసిన గడప గడపను ఇప్పుడు ఫాలో అవుతోంది. ఇంటింటికి జగన్ స్టిక్కర్స్‌ను తప్పుబట్టిన టీడీపీ ఇప్పుడు ప్రతీ ఇంటికి చంద్రబాబు స్టిక్కర్స్ ఇవ్వాలని నిర్ణయించింది. 45 ఇయర్స్ ఇండస్ట్రీ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ సీఎంను ఫాలో అవ్వటం రాజకీయ చర్చగా మారింది.

ఏపీలో రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. జగన్ లక్ష్యంగా పొత్తులు, లెక్కలు సిద్ధం చేస్తున్న టీడీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు మాత్రం జగన్ బాటనే నమ్ముకుంది. సీఎం జగన్ 2019లో అధికారంలోకి వచ్చిన సమయం నుంచి వ్యూహాత్మకంగా 2024 ఎన్నికలపైన ఫోకస్ చేశారు. చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీల అమలు వైఫల్యంపైన పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆయన విశ్వసనీయతను దెబ్బ తీయటంలో సక్సెస్ అయ్యారు. తాను తన తండ్రి తరహాలో మాట ఇస్తే అమలు చేస్తాననే నమ్మకం పెంచుకొనేందుకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాలు అమలు చేశారు. తన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని జగన్ నమ్మకంతో ఉన్నారు.

మరోవైపు టీడీపీ, జనసేనలు జత కట్టటం ఖాయమైంది. బీజేపీ నిర్ణయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమంపై విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు అదే సంక్షేమాన్ని తమ ఎన్నికల ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకుంటోంది. జగన్ తన పథకాలను మహిళలే ప్రధాన లబ్ధిదారులుగా అమలు చేస్తున్నారు. దీంతో జగన్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే మహిళలను ఆకట్టుకోవాలని టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. జగన్ అమలు చేస్తున్న పథకాలు, మహిళా ఓట్ బ్యాంక్ లక్ష్యంగా మహానాడు వేదికగా సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించింది. ఐతే.. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలను, ఇప్పటికే తాము అమలు చేస్తున్న పథకాల మేనిఫెస్టో టీడీపీ ప్రకటించిందని వైసీపీ విమర్శలు చేసింది.

తమ మేనిఫెస్టోను నేతల ద్వారా ప్రచారం చేసినా ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపించలేదు. దీంతో జగన్ అమలు చేస్తున్న విధానం తరహాలో ప్రతీ ఇంటికి వెళ్లాలని డిసైడ్ అయింది. వైసీపీ తీసుకొచ్చిన గృహ సారథులకు పోటీగా కుటుంబ సారథులను రంగంలోకి దించుతోంది. వైసీపీ అమలు చేసిన గడప గపడకు ప్రభుత్వం తరహాలో ప్రతీ ఇంటికి టీడీపీ నేతలను 45 రోజులు పంపాలని నిర్ణయించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + eleven =