ఆర్టికల్ 35A వారికి హక్కులను దూరం చేసింది.. సీజేఐ చంద్రచూడ్‌ కీలక వ్యాఖ్యలు

CJI Chandrachud Says Article 35A Took Away Fundamental Rights of Non Jammu and Kashmir Residents,CJI Chandrachud Says Article 35A,Article 35A Took Away Fundamental Rights,Fundamental Rights of Non Jammu and Kashmir,Non Jammu and Kashmir Residents,Mango News,Mango News Telugu,Article 35A Explained As CJI,Article 370 case Supreme Court hearing,Article 35A, deprived, rights, CJI Chandrachud,CJI Chandrachud Latest News,CJI Chandrachud Latest Updates,Non Jammu and Kashmir Residents News,Non Jammu and Kashmir Residents Latest Updates

రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏ జమ్మూ కాశ్మీర్‌లో నివసించని ప్రజలకు కొన్ని కీలక రాజ్యాంగ హక్కులను దూరం చేసిందని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంలో సమానావకాశాలు, ఉద్యోగం, భూమిని కొనుగోలు చేసే హక్కును ఈ ఆర్టికల్ పౌరుల నుంచి దూరం చేస్తుందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ నివాసితులకు ప్రత్యేక హక్కులు ఉన్నందున, మిగతా వారు తమ హక్కులను కోల్పోయారని అన్నారు.

జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై 11వ రోజు విచారణ సందర్భంగా తాజాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370తో పాటు ఆగస్టు 2019లో రద్దు చేయబడిన ఆర్టికల్ 35A “శాశ్వత నివాసితులను” నిర్వచించడానికి, వారికి ప్రభుత్వ ఉద్యోగం, స్థిరాస్తి, సెటిల్‌మెంట్ పరంగా ప్రత్యేక హక్కులు, అధికారాలను అందించడానికి పూర్వ రాష్ట్ర శాసనసభను అనుమతించింది. “రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉపాధిని తొలగించిన ఆర్టికల్ 16(1) కింద ప్రత్యక్ష హక్కు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కింద ఉపాధి ప్రత్యేకంగా ఆర్టికల్ 16(1) కింద అందించబడింది. కాబట్టి ఒకవైపు ఆర్టికల్ 16(1) మరోవైపు, ఆర్టికల్ 35A నేరుగా ఆ ప్రాథమిక హక్కును కాలరాసింది” అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

అదేవిధంగా, ఆర్టికల్ 19 దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే, స్థిరపడే హక్కును గుర్తిస్తుంది. “అందుకే మూడు ప్రాథమిక హక్కులను తప్పనిసరిగా 35A తొలగించింది” అని అన్నారాయన. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడంలో కేంద్రం చేసిన కీలక వాదనలలో అందరికి సమాన హక్కులు కల్పించడంలో ఒకటి. కేంద్రం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ చర్య జమ్మూ కాశ్మీర్ ప్రజలను దేశంలోని ఇతర ప్రాంతాలతో సమానంగా ఉంచిందని అన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో గతంలో అమలు చేయని సంక్షేమ చట్టాలన్నింటినీ ఇది అమలు చేస్తుందన్నారు. ఉదాహరణకు, విద్యా హక్కును జోడించిన రాజ్యాంగ సవరణను ఆయన ఉదహరించారు. “ఆర్టికల్ 370 ద్వారా అమలు చేయబడే వరకు భారత రాజ్యాంగంలో చేసిన ఏదైనా సవరణ జమ్మూ, కాశ్మీర్‌కు వర్తించదు.. కాబట్టి 2019 వరకు జమ్మూ, కాశ్మీర్‌లో విద్యా హక్కు ఎప్పుడూ అమలు చేయలేదు” అని చెప్పారు. అందుకే ఆర్టికల్ 370, 35 ఏ రద్దు చేసినట్లు కోర్టుకు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 2 =