మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన.. ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో టీడీపీ తొలివిడత మేనిఫెస్టో విడుదల

TDP Chief Chandrababu Releases First Tranche of Election Manifesto During Mahanadu at Rajamahendravaram,TDP Chief Chandrababu Releases First Tranche,TDP First Tranche of Election Manifesto,TDP Election Manifesto During Mahanadu,TDP Mahanadu at Rajamahendravaram,Mango News,Mango News Telugu,Chandrababu Aggressive Speech,TDP Leader Chandrababu Speech,TDP Mahanadu 2023 Live Updates,TDP Chief Chandrababu Latest News,TDP Chief Chandrababu Latest Updates,TDP Chief Chandrababu Live News,TDP Mahanadu Latest News,TDP Election Manifesto Updates,TDP Election Manifesto News,Mahanadu at Rajamahendravaram Latest Updates

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏడాదిలో రానున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా ‘భవిష్యత్ కి గ్యారెంటీ’ పేరుతో తొలి దశ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాబోయే రోజుల్లో భవిష్యత్ కి గ్యారెంటీ మేనిఫెస్టోను మరింతగా పెంచుతామని, ప్రజల జీవితాలు సుభిక్షంగా ఉండేందుకు, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన టీడీపీ మహానాడు ముగింపు సభలో చంద్రబాబు నాయుడు ఈ మేరకు ప్రకటన చేశారు. ఇక ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహా పార్టీకి చెందిన అనేకమంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహానాడుకు భారీగా హాజరైన టీడీపీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు ఆయన పలు హామీలు ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు విడుదల చేసిన టీడీపీ తొలివిడత మేనిఫెస్టోలోని కీలక హామీలు ఇవే..

  • రాష్ట్రంలోని మహిళల సాధికారత కోసం ‘మహాశక్తి’ కార్యక్రమం.
  • ‘ఆడబిడ్డ నిధి’ పథకం కింద 18 నుంచి 59 ఏళ్ల వయస్సు మహిళలకు ఒక్కొక్కరికి నెలకు రూ.1,500 ఆర్ధిక సాయం.
  • ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే.. అంతమందికీ వర్తింపు.
  • ‘తల్లికి వందనం’ పథకం కింద చదువుకుంటున్న పిల్లల తల్లులకు ఏటా రూ.15 వేలు ఆర్ధిక సాయం.
  • ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున సాయం.
  • ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణం.
  • రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు.
  • నిరుద్యోగ యువత కోసం ‘యువగళం నిధి’ కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు భృతి.
  • క‌రోనా కాలంలో కూడా దేశానికి అన్నం పెట్టిన రైతుల కోసం అన్నదాత కార్యక్రమం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం.
  • ఇంటింటికీ మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్లు.
  • ‘పూర్ టూ రిచ్’ పథకం కింద పేదలను సంపన్నులుగా చేసే కార్యక్రమం.
  • రాష్ట్రంలోని బీసీలకు అండగా నిలిచేలా ప్రత్యేక చట్టానికి రూపకల్పన.
  • ఎక్కువమంది పిల్లలు కలిగిన వారికి ఇకపై స్థానిక సంస్థల్లో పోటీకి అర్హత కల్పించేందుకు ‘ఇద్దరు పిల్లల’ చట్టం రద్దు.
  • యువతకు వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు కేటాయింపు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =