హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి.. దానికోసం దేనికైనా సిద్ధమే – ఎమ్మెల్యే బాలకృష్ణ

Demand for making Penukonda district headquarters gro, Hindupur, Mango News, MLA Balakrishna enters the field for Hindupuram, MLA Balakrishna enters the field for Hindupuram district, Nandamuri Balakrishna, Nandamuri Balakrishna Demands For Hindupur, Nandamuri Balakrishna To Be Conducts Rally, TDP MLA, TDP MLA Balakrishna, TDP MLA Nandamuri Balakrishna, TDP MLA Nandamuri Balakrishna Demands For Hindupur, TDP MLA Nandamuri Balakrishna Demands For Hindupur As Headquarters of New District

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. దానికోసం దేనికైనా సిద్ధమే అని నందమూరి బాలకృష్ణ అన్నారు. అవసరమైతే, ఎమ్మెల్యే పదవిని వదులుకోవడానికి కూడా సిద్దమే అని ఆయన ప్రకటించారు. అనంతపురంలో కొత్తగా ఏర్పాటుకానున్న జిల్లాకు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బాలకృష్ణ గత కొద్ధి రోజులుగా ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో.. బాలకృష్ణ నిన్న హిందూపూర్ లో ఒక రోజు నిరసన దీక్ష కూడా చేశారు. జిల్లాకు ఏ పేరు అయినా పెట్టుకోవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు బాలకృష్ణ. అధికార పార్టీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని బాలకృష్ణ అన్నారు.

ఈ అంశంపై అవసరమైతే సీఎం జగన్ ని కూడా కలుస్తానని ఆయన చెప్పారు. హిందూపురం జిల్లా కేంద్రం కోసం దేనికైనా సిద్ధమేనన్నారు బాలకృష్ణ. అయితే, కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాకు తన తండ్రి ఎన్టీఆర్ పేరు పెడతామంటున్నారని.. అయితే ఇది కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికే అని బాలకృష్ణ విమర్శించారు. నిజంగా ఎన్టీఆర్ పై అంట ప్రేమ ఉంటే.. కొత్త జిల్లాల ప్రకటన తర్వాత ఎక్కడపడితే అక్కడ ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని బాలకృష్ణ మండిపడ్డారు. ఎన్టీఆర్ పై నిజమైన ప్రేమ ఉంటే గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ పేరుతొ పెట్టిన పథకాలను కంటిన్యూ చేయాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. అన్న క్యాంటీన్ లను ఓపెన్ చేయాలని బాలకృష్ణ ప్రభుత్వానికి సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here