వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్?

New Twist in Ys Vivekananda Reddy Demise Case?,Mango News,New Twist in YS Vivekananda Reddy Case,YS Vivekananda Reddy Latest News,Shocking Twist In Vivekananda Reddy Demise Case,Sensational twist in YS Vivekananda Reddy Demise Case,#YSVivekanandaReddy

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు త్వరితగతిన పురోగతి సాధించటానికి, కొంతమందికి నార్కో పరీక్షలు చేయాలనీ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా పులివెందుల లోని మాజీ ఎంపి వివేకానంద రెడ్డి ఇంటి కాపలాదారు రంగయ్యపై నార్కో పరీక్షలు నిర్వహించడానికి, అనుమతి ఇవ్వాలని కోర్టు కి విన్నవించగా, కోర్టు బుధవారం పోలీస్ అధికారులకు అనుమతి ఇచ్చింది. ఇదే కేసులో కిరాయి హంతకుడు శేఖర్ రెడ్డి కి కూడా నార్కో పరీక్షల నిర్వహించడానికి అనుమతి కోసం పోలీసులు పులివెందుల కోర్టుని ఆశ్రయించారు.

వివేకానంద రెడ్డిని మార్చి 15 న అతని ఇంట్లోనే హత్య చేసినట్లు గుర్తించారు మరియు కేసు దర్యాప్తు కోసం కొత్తగా వైయస్ జగన్ సారధ్యంలో ఎన్నికైన ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేశారు. ముందుగా సాక్ష్యాధారాలను దెబ్బతీసిన ఆరోపణలపై వివేకానంద రెడ్డి యొక్క ముఖ్య సహచరులు గంగి రెడ్డి మరియు కృష్ణారెడ్డితో సహా కొంతమందిని సిట్ అరెస్టు చేసింది , అనంతరం వారిని బెయిల్‌పై విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here