భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ‘ఇన్‌కోవాక్‌’ ను లాంఛ్ చేసిన కేంద్ర మంత్రులు

Union Health Minister Mansukh Mandaviya Unveiled First Intranasal COVID19 Vaccine iNNCOVACC Which Develops by Bharat Biotech,Union Health Minister Mansukh Mandaviya, Unveiled First Intranasal COVID19 Vaccine, iNNCOVACC,Which Develops by Bharat Biotech,Mango News,Mango News Telugu,Covid Last 24 Hours, People Tested Positive,Coronavirus In India,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live Updates

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ‘ఇన్‌కోవాక్‌’ ను గురువారం కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయా ఆవిష్కరించారు. ఇన్‌కోవాక్‌ అనేది ప్రైమరీ 2-డోస్ షెడ్యూల్ కోసం ఆమోదం పొందిన ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రానాసల్ COVID19 వ్యాక్సిన్ మరియు హెటెరోలాగస్ బూస్టర్ డోస్ గా నిలిచింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈ వ్యాక్సిన్ ను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం యొక్క పీఎస్యూ అయిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ (బీఐఆర్ఏసీ) సహకారంతో అభివృద్ధి చేసింది.

ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవియా మాట్లాడుతా, ప్రపంచంలో సరఫరా చేయబడిన 65% వ్యాక్సిన్‌లు భారతదేశం నుండి ఉన్నాయని అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి నాసల్ వ్యాక్సిన్‌ను తీసుకొచ్చినందుకు భారత్ బయోటెక్ బృందానికి మరియు కేంద్ర బయోటెక్ విభాగానికి అభినందనలు తెలిపారు. ఇన్‌కోవాక్‌ ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రా-నాసల్ కోవిడ్ 19 వ్యాక్సిన్, ఇది ఆత్మనిర్భర్ భారత్ పిలుపుకు అద్భుతమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన మరియు సరసమైన మందులను ఉత్పత్తి చేయడంలో భారతదేశం యొక్క వ్యాక్సిన్ తయారీ మరియు ఆవిష్కరణ సామర్థ్యం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసించబడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయా తెలిపారు. అలాగే కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, బీఐఆర్ఏసీ సహకారంతో మరో వ్యాక్సిన్‌ని ఆవిష్కరించినందుకు భారత్ బయోటెక్ సంస్థను అభినందించారు. అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో సాధారణ వ్యాధులకు వ్యాక్సిన్‌లు మరియు మందులను అభివృద్ధి చేయడంలో భారతదేశం ముందంజలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, ఎండీ సుచిత్రా ఎల్లా, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలే, టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు కార్యదర్శి రాజేష్ కుమార్ పాఠక్ మరియు మంత్రిత్వ శాఖలోని ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇన్‌కోవాక్‌ వ్యాక్సిన్ ను 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కోవిడ్-19 బూస్టర్ డోస్‌గా పరిమితులతో కూడిన అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవలే అనుమతులిచ్చింది. ముక్కు ద్వారా తీసుకునే ఈ ఇన్‌కోవాక్‌ వ్యాక్సిన్ ను కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసుకు రూ.325 చొప్పున మరియు ప్రైవేట్ ఆసుపత్రులు/ప్రైవేట్ మార్కెట్స్ కు ఒక్కో డోసుకు రూ.800 చొప్పున విక్రయించనున్నట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. ఇన్‌కోవాక్‌ అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్న కోవిడ్ వ్యాక్సిన్, దీనికి సిరంజిలు, సూదులు, ఆల్కహాల్ వైప్స్, బ్యాండేజ్ మొదలైనవి అవసరం లేదు. సాధారణంగా ఇంజెక్ట్ చేయదగిన వ్యాక్సిన్‌ లకు సేకరణ, పంపిణీ, నిల్వ మరియు బయోమెడికల్ వ్యర్థాల నిర్మూలనకు సంబంధించిన ఖర్చులను ఆదా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్‌కోవాక్‌ వ్యాక్సిన్ వెక్టార్-ఆధారిత ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకుంటుంది. ఇప్పటికే ముందస్తు ఆర్డర్‌లు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులలో ఇన్‌కోవాక్‌ వ్యాక్సిన్ యొక్క రోల్ అవుట్ త్వరలోనే ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =