ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలో నేడు ఇఫ్తార్‌ విందు.. హాజరవనున్న సీఎం జగన్

AP CM YS Jagan Mohan Reddy To Attend Iftar Party at IGMC Stadium Today, AP Govt To Host Grand Iftar Dinner At Vijayawada's IGMS, Grand Iftar Dinner At Vijayawada's IGMS, AP Govt To Host Grand Iftar Dinner, Andhra Pradesh Govt is scheduled to host a grand Iftar dinner on the 27th of April, grand Iftar dinner, Vijayawada's IGMS, AP Govt To Host Iftar Dinner in Vijayawada, Andhra Pradesh government will be hosting an Iftar dinner on the 27th of April, Grand Iftar event would be held at the Indira Gandhi Municipal Stadium in Vijayawada, Vijayawada Indira Gandhi Municipal Stadium, Iftar dinner News, Iftar dinner Latest News, Iftar dinner Latest Updates, Iftar dinner Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, AP CM, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 27న విజయవాడలోని ఇందిరాగాంధీ (ఐజీఎం) స్టేడియంలో నిర్వహించనున్న ఇఫ్తార్ వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. మంగళవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన ఉపముఖ్యమంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి షేక్ అంజాద్ బాషా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి సుమారు 6 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అందుకే ఈ ఇఫ్తార్‌లో 5 వేల నుంచి 6 వేల మంది ముస్లిం సోదరులు పాల్గొని ఉపవాస దీక్షలు విరమించే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని బాషా తెలిపారు. ముస్లిం మైనార్టీల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం చివరిసారిగా 2019లో ఇఫ్తార్‌ను నిర్వహించిందని, కోవిడ్‌ మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో ఇఫ్తార్‌ విందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అన్ని జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేస్తామని, ఒక్కో జిల్లాకు 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్‌ను నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ అని అన్నారు. ఈ సందర్భంగా వన్ టౌన్‌లోని విజయవాడ వెస్ట్ రైల్వే బుకింగ్ సెంటర్ సమీపంలో వంద సంవత్సరాల పురాతన భవనం స్థానంలో ₹15 కోట్లతో నిర్మించిన ముసాఫిర్ ఖానా, ఫంక్షన్ హాల్-కమ్-షాపింగ్ కాంప్లెక్స్‌ను కూడా సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ముసాఫిర్ ఖానా, రెండు ఫంక్షన్ హాళ్లు మరియు అనేక దుకాణాలతో కూడిన మూడు అంతస్తుల నిర్మాణం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నిర్మించబడింది మరియు దీనిని AP రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు అప్పగించారు. ఈ నేపథ్యంలో నిన్న ఐజీఎంసీ స్టేడియంలో ఏర్పాట్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, పోలీసు కమిషనర్‌ కాంతి రాణా టాటా తదితరులతో కలిసి బాషా పరిశీలించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 11 =