టీడీపీ నేత పట్టాభిని గన్నవరం సబ్ జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు

TDP Spokesperson Kommareddy Pattabhi Shifted To Rajahmundry Central Jail From Gannavaram Sub-Jail, TDP Spokesperson Kommareddy Pattabhi, Kommareddy Pattabhi Shifted To Rajahmundry Central Jail, Pattabhi Shifted To Rajahmundry Central Jail From Gannavaram Sub-Jail, Mango News, Mango News Telugu,Tdp Spokesperson Pattabhi,Gannavaram Sub Court,Gannavaram Sub Inspector Name,Kommareddy Pattabhi Contact Number,Kommareddy Pattabhi Ram Tdp Phone Number,Pattabhi Tdp Spokesperson Phone Number,Pin Code For Rajahmundry Central Jail,Rajahmundry Central Jail,Rajahmundry Central Jail Address,Rajahmundry Central Jail Inside,Rajahmundry Central Jail Kaidi,Rajahmundry Central Jail Live,Rajahmundry Central Jail Phone Number,Rajahmundry Central Jail Pincode,Rajahmundry Central Jail Superintendent,Rajahmundry Central Jail Visiting Hours,Tdp Pattabhi Comments,Tdp Spokesperson,Tdp Spokesperson List

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌ను గన్నవరం పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయనను గన్నవరం సబ్ జైల్ నుండి భారీ బందోబస్తు నడుమ సెంట్రల్ జైలుకు తరలించారు. పట్టాభితో పాటు రిమాండ్ విధించబడిన మరో 10 మంది టీడీపీ కార్యకర్తలను కూడా అదే వాహనంలో రాజమండ్రికి తీసుకెళ్లారు. కాగా మూడు రోజుల క్రితం గన్నవరంలో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభి సహా 10 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎ1 గా పట్టాభిని, ఎ2 గా చిన్నాను చేర్చారు.

కాగా గన్నవరం సబ్ జైల్లో భద్రతతో పాటు నిందితులకు సరిపడినన్ని గదులు కూడా లేవని గన్నవరం జైలు అధికారి న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. వీరిని ఇక్కడే ఉంచితే టీడీపీ నాయకులు భారీగా వచ్చే అవకాశం ఉందని, కంట్రోల్ చేయడం కష్టమని కూడా కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి వీరిని దగ్గరలోని విజయవాడకు తరలించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. అయితే విజయవాడ జైలులో కూడా సరిపడా ఖాళీలు లేవని అధికారులు న్యాయమూర్తికి తెలియజేశారు. దీంతో పోలీసుల అందించిన వివరాలను పరిశీలించిన గన్నవరం కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. పట్టాభితో పాటు మరో 10 మందిని రాజమండ్రి జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =