తుని టికెట్‌కు గురిపెట్టిన ముద్రగడ

The Mudragada Addressed to the Tuni Ticket, Mudragada Addressed to Tuni Ticket, Mudragada Addressed, Tuni Ticket Mudragada, AP Politics, Mudragada Padmanabham, Dadishetti Raja, YCP, AP Assembly Elections, Latest Mudragada Ticket News, Mudragada Ticket News Update, Tuni Ticket News,Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
AP Politics, Mudragada Padmanabham, Dadishetti Raja, YCP, AP Assembly elections

అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.  పొత్తులు, ఎత్తులు, జంపింగ్ రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. కొద్దిరోజులుగా సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం అధికార వైసీపీలో చేరబోతున్నట్లు ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముద్రగడ.. వైసీపీ అధినేత జగన్‌లో చర్చలు కూడా జరిపారట. దాదాపు వైసీపీలోకి ముద్రగడ చేరిక ఖాయమయిందట. రూపో.. మాపో ఆయన జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ముద్రగడకు వైసీపీ హైకమాండ్ రెండు ఆఫర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముద్రగడ ఫ్యామిలీకి ఒక ఎంపీ టికెట్, ఒక అసెంబ్లీ టికెట్ ఆఫర్ చేసిందట. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ముద్రగడ పద్మనాభంను పోటీ చేయించాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. ఆయన్ను అక్కడి నుంచి పోటీ చేయించడం ద్వారా కచ్చితంగా గెలిచి తీరుతారని అనుకుంటున్నారట. అంతేకాకుండా ఆ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకునేందుకు ఆస్కారం ఉంటుందని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట.

ఇకపోతే ఈసారి అసెంబ్లీ టికెట్ పద్మనాభం చిన్న కోడలు సిరికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పెద్దాపురం నుంచి సిరిని ఎన్నికల బరిలోకి దింపాలని హైకమాండ్ ఆలోచిస్తోందట. అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం తుని టికెట్ కావాలని హైకమాండ్ వద్ద పట్టుపట్టుకొని కూర్చున్నారట. ఇప్పటికే రెండుసార్లు ఆ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. ఈసారి కూడా అక్కడ వైసీపీ జెండా ఎగిరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సర్వేలు కూడా అదే చెబుతున్నాయి. ఈక్రమంలో తుని నుంచి తన కోడలును నిలబెడితే కచ్చితంగా గెలిచి తీరుతుందని పద్మనాభం భావిస్తున్నారట.

అయితే ఇక్కడే చిన్న సమస్యొచ్చి పడింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి దాడి శెట్టి రాజా ఉన్నారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దాడిశెట్టి రాజా ఆ స్థానం నుంచి గెలుపొందారు. ఈసారి కూడా టికెట్ తనకే ఇవ్వాలని రాజా పట్టుపడుతున్నారట. తుని నుంచి మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొడుతానని అంటున్నారట. అక్కడి క్యాడర్ కూడా దాడిశెట్టి రాజాకే మరోసారి టికెట్ ఇవ్వాలని అంటోందట. మరి హైకమాండ్ ఎటువైపు మొగ్గు చూపుతుంది..? తుని టికెట్ ఎవరికి కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =