రామరాజు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

There Is Still Suspense Over Raghuramakrishna Rajus Contest, Raghuramakrishna Rajus Contest, Suspense Over Raghuramakrishna Raju Seat, Raghuramakrishna Raju Political News, Raghurama Krishnam Raju, TDP, YCP, AP Elections, AP, CM Jagan, Andhra Pradesh, Andhra Pradesh Elections, AP Live Updates, AP Political News, Mango News, Mango News Telugu
raghurama krishnam raju, tdp, ycp, ap elections, ap

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల ప్రచారాల హీటు పెరిగిపోతోంది.  మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అన్ని పార్టీలు అలర్ట్ అవుతుండగా.. పార్టీల అధ్యక్షులు ప్రచారాలలో హోరెత్తిస్తున్నారు. అయితే ఇటు కూటమి పార్టీల్లోని అభ్యర్దుల్లో కొంతమందిని మార్చుతారన్న టాక్ నడుస్తోంది.

రఘురామ రాజు టీడీపీ నుంచి పోటీకి రంగం సిద్దమడం.. సీటు పైనా స్పష్టత వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇటు గోదావరిలో మారుతున్న లెక్కలతో ప్రతీ సీటు కూడా ప్రతీ  పార్టీకి కీలకంగా మారుతుంది.  ఏపీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుండటంతో.. సీట్ల మార్పు వ్యవహారం పూర్తి చేయాలని అధినేతలు భావిస్తున్నారు.

గోదావరి జిల్లాల్లో అనపర్తి, ఉండి, దెందులూరుతో పాటుగా అనకాపల్లి, విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో అభ్యర్థల టికెట్ల మార్పు పైన తుది చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో  ఈ నెల 22న  నామినేషన్ దాఖలుకు  ముహూర్తం ఖరారు చేసుకున్న రఘురామ రాజు.. తన  పోటీ చేసే స్థానం పైన ఈ రోజు అంటే సోమవారం సాయంత్రంలోగా నిర్ణయం వస్తుందని చెబుతున్నారు.

నర్సాపురం ఎంపీ టికెట్‌ను  తమకు ఇస్తే, ప్రత్యామ్నాయంగా ఉండి ఎమ్మెల్యే సీటును భారతీయ జనతా పార్టీకి ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. తాజాగా దెందులూరు సీటు పైన కూడా  ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఉండి నుంచి రఘురామ కృష్ణరాజు కనుక పోటీ చేస్తే అక్కడ ఇప్పటికే టీడీపీ అభ్యర్దిగా ఖరారైన రామరాజు భవితవ్యతం ఏంటనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే రఘురామ పేరును ఎందుకు  పరిశీలనకు తీసుకున్నామనే కారణాలను తాజాగా తనను కలిసిన రామరాజుకు చంద్రబాబు వివరించారు. కానీ రామరాజు వర్గం మాత్రం అభ్యర్దిని మార్చితే ..కఠిన నిర్ణయాలు తప్పవని చంద్రబాబుకు చెప్పేసింది. అయితే రామరాజుకు మద్దతుగా దీక్షకు దిగిన వారి పైన రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు  వివాదానికి కారణమవడంతో.. తన వ్యాఖ్యలు ఉప సంహరించుకుంటున్నట్లు రఘురామ చెప్పుకొచ్చారు.

ఇప్పుడు రఘురామ ఉండి నుంచి పోటీ చేస్తారని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ సీటు దక్కకపోవడంతో.. రెండు సార్లు ఎమ్మెల్యేగా  విజయం సాధించిన వెంకట శివ రామ రాజు స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. మరి ఇప్పుడు రఘురామకృష్ణకు ఉండి సీటు కేటాయిస్తే.. రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 16 =