ఏపీలో హీటు పుట్టిస్తున్న రాళ్ల రాజకీయం

The Politics Of Throwing Stones Creating Heat In AP, Throwing Stones Creating Heat In AP, Heat In AP, Throwing Stones,YCP, TDP, Janasena, Chandrababu, Jagan, Pawan Kalyan, AP, CM Jagan, AP Politics, YCP, AP Elections, Attack On Jagan, Andhra Pradesh, Andhra Pradesh Elections, AP Live Updates, AP Political News, Mango News, Mango News Telugu
The politics of stones creating heat in AP politics,throwing stones,YCP, TDP, Janasena, Chandrababu, Jagan, Pawan Kalyan

పార్టీలు ఎన్నయినా ఉండొచ్చు. నాయకులు ఎంత మంది అయినా రావచ్చు. కానీ కార్యకర్తలు అనేవారు లేకపోతే పార్టీ ఊసే ఉండదు.. నాయకుల మాటే ఉండదు. ఎందుకంటే జెండా మోసేది ..దండ వేసేది..ర్యాలీలు చేసేది..చివరకు ఓట్లు వేయించేది కూడా కార్యకర్తే. అందుకే పార్టీకి, నాయకుడికి కార్యకర్త ఆయువు లాంటివాడు. ఇంకా చెప్పాలంటే పార్టీ అనే పొలంలో దుక్కి దున్ని నారు పోసి.. కలుపు తీసి, ధాన్యాన్ని పండించేది కార్యకర్త అయితే, ఆ వచ్చిన వరి ధాన్యాన్ని అమ్ముకునేది మాత్రం నాయకుడని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కూడా అచ్చంగా అలాగే తయారైంది.

ఇన్నేళ్ల రాజకీయ వ్యవస్థలో పదుల సంఖ్యలో కార్యకర్తలు ఎదిగారు తప్ప..మిగిలిన వారంతా ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. నాయకులు మాత్రం పార్టీలు మారుతూ, వారి రాజకీయ హోదాను, అంతస్తులను పెంచుకుంటున్నారు. కార్యకర్తలతోనే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ తాము అన్ని భోగాలు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి పాలిటిక్స్ స్టాటజీ ఏపీలో కాస్త ఎక్కువగా నడుస్తుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా కుల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తుండం ఏపీలో చాలా ఎక్కవ.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రాళ్ల రాజకీయం నడుస్తోందన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 13న ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడి జరగగా.. ఈ దాడి టీడీపీకి సంబంధించిన వాళ్లే ఈ దాడి చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ ఘటనపై ఒకవైపు చర్చలు సాగుతుండగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై, టీడీపీ అధినేత చంద్రబాబుపైన కూడా రాళ్ల దాడి జరిగింది. దీంతో ఇది వైసీపీ పనే అని టీడీపీ, జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక విషయం గురించి చెప్పుకోవాలి. సాధారణంగా ఇలాంటి ఎంక్వైరీలలో చివరకు దోషిగా నిలిచేది కార్యకర్తలే అవుతారు. ఆ కార్యకర్తలను అరెస్టు చేసి కటకటాల వెనుకకు పంపిస్తే ఏ పార్టీ నేత పరామర్శించడు. ఏ నాయకుడు కదిలి రాడు.

ఈ దాడులకు ప్రేరేపించేది మాత్రం నాయకులే అయినా చివరకు బలయ్యేది కార్యకర్తలే. ఎన్నికలలో విజయం సాధిస్తే అధికారంలో కూర్చునేది ఆ నేతలే. కానీ జైలు పాలయ్యేది మాత్రం కార్యకర్తలే. ఇప్పటి వరకూ ఏ రాజకీయ చరిత్ర చూసినా నాయకుల ఆస్తులు పెరిగాయి కానీ కార్యకర్తల ఆస్తులు పెరిగిన దాఖలాలే లేవు. అందుకే ఇప్పటికయినా కుల,మత పిచ్చి రాజకీయాలకు కార్తకర్తలు దూరంగా ఉండాలని కోరుకుందాం. నాయకులు రెచ్చగొట్టారని రెచ్చిపోతే బలయ్యేది కార్యకర్త, వారి కుటుంబమే అని సత్యాన్ని తెలుసుకోవాలి. రాళ్లు విసిరే, దాడులు చేసే విష సంస్కృతికి చెక్ పెట్టి నిజమైన రాజకీయాలను భావితరాలకు అందేలా కృషి చేయాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + four =