తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్‌

Tirumala Srivari Brahmotsavalu CM YS Jagan Offers Silk Clothes to Lord Sri Venkateswara at Tirumala, CM YS Jagan Offers Clothes to Lord Sri Venkateswara, YS Jagan Offers Clothes At Tirumala, Tirumala Srivari Brahmotsavalu, Tirumala Srivari Brahmotsavalu, TTD Brahmotsavalu, Srivari Brahmotsavalu, Tirumala Brahmotsavalu, AP CM YS Jagan Mohan Reddy , Mango News, Mango News Telugu, TTD, Tirumala Tirupati Devasthanam, TTD Latest News And Updates, Tirupati Brahmotsavalu, Brahmotsavalu

తిరుమలలో మంగళవారం నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తిరుమల చేరుకొని శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా సంప్రదాయ వస్తధారణతో వచ్చిన సీఎంకు అర్చకులు సంప్రదాయబద్ధంగా తలపాగా చుట్టారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు నడుమ పట్టు వస్త్రాలను తలపై మోసుకుంటూ వెళ్లి, శ్రీవారికి సీఎం వైఎస్ జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారిని సీఎం దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కు వేద పండితుల ఆశీర్వచనం చేశారు. అలాగే సీఎం తులభారం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అనంతరం తిరుమల మాడవీధుల్లో జరిగే శ్రీవారి పెద్ద శేష వాహన సేవలో సీఎం పాల్గొంటారు. ఈ రాత్రికి తిరుమలలోనే బసచేస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎంతో పాటుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, టీటీడీ ఈవో, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. బుధవారం కూడా సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన కొనసాగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − three =