ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. బదిలీలకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

CM Jagan Gives Green Signal For The Transfers of Village and Ward Secretariat Employees in AP,CM Jagan Gives Green Signal For The Transfers,Transfers of Village and Ward Secretariat Employees,Green Signal For The Transfers in AP,Ward Secretariat Employees in AP,Transfers of Village in AP,Mango News,Mango News Telugu,CM Jagan's Green Signal For Transfers,Secretariat Employees Transfers Latest News,Secretariat Employees Transfers Latest Updates,CM Jagan Latest News and Updates

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బదిలీలను చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. ఈ క్రమంలో అధికారులు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు జూన్ 10 వరకు అవకాశం కల్పించారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ప్రొబేషన్ ప్రకటించిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులుగా నిర్ణయించారు. ఇక జిల్లాల మధ్య బదిలీలతో పాటు అంతర్ జిల్లా బదిలీలకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం, అంతర్ జిల్లా బదిలీలలో జీవిత భాగస్వామి కేసులలో పరస్పర బదిలీలకు ఆస్కారం ఉంటుంది. ఇక సచివాలయ ఉద్యోగుల బదిలీకి అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా గత మూడు సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అమోదం తెలపడంతో సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల బదిలీకి అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు విధి నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ముఖ్యంగా భార్యా భర్తలు వేరు వేరు జిల్లాల్లో పని చేస్తూ ఉండటం వలన వారి పిల్లల చదువులు, మరియు ఇతర కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని సచివాలయాల శాఖ అధికారులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మరియు సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లడంతో వారు సానుకూలంగా స్పందించారని, జిల్లా మరియు అంతర్ జిల్లా బదిలీలకు అమోదం తెలిపారని వెంకట్రామిరెడ్డి వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here