టీటీడీ పెట్టుబడులు, డిపాజిట్లపై శ్వేతపత్రం విడుదల

TTD Released a White paper on Investments and Gold Deposits, TTD Released White Paper,TTD Investments and Gold Deposits, Tirumala Srivari Temple,Tirumala Temple Closed,Lunar Eclipse,Mango News,Mango News Telugu,Lunar Eclipse In Tirumala, Tirumala Doors Closed,Tirumala Tirupati,Tirumala Tirupati Devasthanam,Tirumala Latest News And Updates,Tirupati News And Live Updates,Tirpati Lunar Eclipse,Lunar Eclipse,Ttd,Ttd Chairman,Ttd News And Updates,

శ్రీవారి ఆస్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్వేతపత్రం విడుదల చేసింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి 2019 నుండి పెట్టుబడి మార్గదర్శకాలను మరింత బలోపేతం చేసిందని చెప్పారు. బోర్డు, మరియు టీటీడీ ఛైర్మన్ టీటీడీ యొక్క నిధులను భారత ప్రభుత్వ సెక్యూరిటీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారని గ‌త కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయని, ఇవి పూర్తిగా అవాస్త‌వమని, ఈ ప్ర‌చారాన్ని టీటీడీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిన కరోనా కాలంలోనూ, స‌మ‌ర్థ‌వంతమైన ఆర్థిక నిర్వహణ ద్వారా టీటీడీ ఆదాయం పెరిగిందని, శ్రీ‌వారి భక్తులు ఇలాంటి కుట్ర‌పూరిత త‌ప్పుడు ప్ర‌చారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. టీటీడీ వివిధ బ్యాంకుల్లో చేసే న‌గ‌దు, బంగారు డిపాజిట్లు అత్యంత పారదర్శకంగా జరుగుతాయన్నారు

కాగా టీటీడీ పెట్టుబడులు, డిపాజిట్లపై విడుదల చేసిన శ్వేతపత్రంలో 2019, జూన్ 30 మరియు 2022, సెప్టెంబర్, 30 నాటికీ పెట్టుబడులు (బ్యాంక్ వారీగా డిపాజిట్లు), గోల్డ్ డిపాజిట్ వివరాలను తెలియజేశారు. మొత్తం 24 బ్యాంకుల్లో రూ.15,938.68 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని, అలాగే 2 బ్యాంకుల్లో 10,258.37 కిలోల గోల్డ్ డిపాజిట్లు ఉన్నట్టు తెలిపారు. 2019, జూన్‌ 30 నాటికి రూ.13,025.09 కోట్లు డిపాజిట్లు, 7,339.74 కేజీల గోల్డ్ ఉండగా, 2022,సెప్టెంబర్ 30 నాటికీ రూ.15,938.68 కోట్ల డిపాజిట్లకు, 10,258.37 కేజీల గోల్డ్ కు చేరుకుందని టీటీడీ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 8 =