తెలంగాణ కంటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యంగా జరుగబోతున్నా కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా రాజకీయ వాతావారణం హీటెక్కింది. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు అరస్ట్‌తో కొత్త టర్న్ తీసుకున్న రాజకీయాలు ఎన్నికల సమీకరణాలను మార్చేశాయి. మరోవైపు వచ్చే ఎన్నికల కోసం కూడా ప్రధాన పార్టీలన్నీ.. అభ్యర్ధుల కోసం చేస్తున్న కసరత్తులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఇలాంటి పోరు ఇదే చివరి సారి అన్నట్లుగా హోరాహోరీ యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి.
తాజాగా కేంద్రం తీసుకున్న మహిళా బిల్లు ఆమోదంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మరింతగా మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇప్పటికే అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్ధుల ఎంపికకు సర్వేలు చేయిస్తూ వాటి ఆధారంగా అభ్యర్ధుల తలరాతల్ని పరీక్షించడానికి లెక్కలు కూడా సిద్ధం అయిపోతున్నాయి. చాలామంది అభ్యర్దుల పేర్లు ఖరారు కాగా కొంతమంది మాత్రం సీటు తమకేనని ఆశావాహులు ఫిక్స్ కూడా అయిపోయారు. అయితే ఇలాంటి సమయంలో తెరమీదకు వచ్చిన మహిళా బిల్లును తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రత్యేక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తరువాత ఏపీ, తెలంగాణతో 50 శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపడం కూడా లాంఛన ప్రాయమే.నిజానికి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినా కూడా అది అమలయేది 2027 తర్వాతే. ఎందుకుంటే దేశంలో అన్ని నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా బిల్లును అమలు చేయగలుగుతారు. అప్పుడే చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలవుతాయి.
కానీ ఇక్కడే ఓటర్ల నాడిని పట్టుకోవడానికి జగన్ ప్రభుత్వం రెండడుగులు ముందుకు వేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మహిళా బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈ ప్రభావం 2024 తర్వాత రానున్న .. వచ్చే ఎన్నికల్లో ఉంటుంది ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ఉండదు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎలాగూ దీనిపైన దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి.. దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని మహిళా ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత సభలో మహిళా సభ్యురాళ్ల సంఖ్య 15గా ఉంది.ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక..పార్టీ పదవులతో పాటు చాలా వరకూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అంటూ చెబుతున్నారు. అదే అంశాన్ని ఇప్పుడు మేనిఫెస్టోలో చేర్చి మరింత మంది మహిళలకు అసెంబ్లీలో చోటివ్వడానికి సమాయత్తమవుతున్నారు. వీలయితే 57 నుంచి 58 స్థానాలను మహిళలకు కేటాయించడానికి రెడీ అవుతున్నారు. ఆకాశంలో సగం అవకాశాలలో సగం అని ఉన్న నినాదానికి కేంద్రం కంటే ముందే తాము కట్టుబడి ఉన్నట్లు చెబుతూ ఎన్నికల ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకోబోతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE