ఈఏపీ సెట్‌-2022: ఈ ఏడాది కూడా ఇంటర్‌ వెయిటేజీ తొలగింపు

APSCHE Removes 25 Percent Weightage of Intermediate Marks in AP EAP CET-2022, 25 Percent Weightage of Intermediate Marks in AP EAP CET-2022, APSCHE Removes 25 Percent Weightage of Intermediate Marks, AP EAP CET-2022, AP EAPCET, 2022 AP EAPCET, No 25% weightage of intermediate marks, Andhra Pradesh State Board of Higher Education, APSCHE removed the weightage of 25% intermediate marks in AP EAPCET, No weightage of intermediate marks, intermediate marks, 2022 AP EAPCET News, 2022 AP EAPCET Latest News, 2022 AP EAPCET Latest Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్-2022 లో ఇంటర్మీడియట్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని తొలగిస్తునట్టు ప్రకటించారు. ముందుగా గత సంవత్సరం కరోనా పరిస్థితుల కారణంగా ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసి ప్రత్యేక విధానంలో విద్యార్థులకు మార్కులను కేటాయించడంతో ఒక్క ఏడాదికే (ఈఏపీ సెట్-2021) లో 25 శాతం ఇంటర్‌ మార్కుల వెయిటేజీ తొలగింపును అమలు చేస్తునట్టు తెలిపారు. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020-21 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహించబడలేదని, ఇంటర్మీడియట్ ప్రదర్శన ఆధారంగా ఈఏపీ సెట్-2022 ర్యాంక్‌లను కేటాయించేటప్పుడు 25% గ్రూప్ సబ్జెక్టులను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి నివేదించింది.

మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షకు ఫీజు చెల్లించిన అభ్యర్థులందరూ 2020-21 విద్యా సంవత్సరానికి కనీస ఉత్తీర్ణత మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించామని, దీంతో ఈఏపీ సెట్-2022 లో ఇంటర్ మార్కుల వెయిటేజీ ఇవ్వడం కుదరదని, ఏడాది కూడా ఇంటర్‌ వెయిటేజీ తొలగింపుపై అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత విద్యా మండలి కోరింది. ఈ అంశాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలించిన తర్వాత, ఈఏపీ సెట్-2022 లో మొత్తం ర్యాంకింగ్‌ను నిర్ణయించడం కోసం ఈ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే 100శాతం వెయిటేజీ ఇచ్చి ఫలితాలు/ర్యాంకులు ప్రకటించేందుకు ఉన్నత విద్యా మండలికి అనుమతి ఇచ్చింది. మరోవైపు ఈఏపీ సెట్-2022 లో భాగంగా జులై 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అయిదు రోజులపాటు ఇంజనీరింగ్ స్ట్రీమ్‌ పరీక్షలు, జులై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ స్ట్రీమ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =