నోబెల్ అవార్డు గెలిస్తే..?

Do You Know The Nobel Prize And The Winning Cash,Nobel Prize And The Winning Cash,Nobel Prize Winning Cash,Nobel Prize Cash,Mango News,Mango News Telugu,The Nobel Prize Money,Nobel Prize Money For 2023 Increased,Nobel Prize,Nobel Prize Winners,Nobel Prize 2023,Nobel Prize Winner 2023,Nobel Prize Amount,Nobel Prize Awards,Nobel Prize Facts

నోబెల్ బహుమతి.. ప్రపంచంలోనే ఇది అత్యున్నత పురస్కారం. అందుకే జీవితంలో ఒక్కసారైనా దీనిని అందుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కలలు కంటారు. నోబెల్ ఫ్రైజ్ గెలిచాక ఇక జీవితంలో ఏదీ సాధించాల్సిన పని లేదంటూ దీనికోసం ఆరాటపడతారు. అలాంటి అత్యున్నత పురస్కారం ఇవ్వడానికి జాతి, మతం, ప్రాంతం ఇవేమీ పట్టించుకోరు. కేవలం వివిధ రంగాలలో మానవ శ్రేయస్సుకు మేలు చేసిన వారిని మాత్రమే ఈ పురస్కారం వరిస్తుంది.

నిజానికి ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ అనే స్వీడిష్‌ శాస్తవ్రేత్త..చలువ వల్ల నోబెల్ బహుమతులను ఏటా అందిస్తున్నారు. ఆల్ఫ్రెడ్ తన వీలునామాలో తన ఆస్తి మొత్తం అంటే 90 లక్షల డాలర్ల విలువైన ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని.. ప్రతీ ఏటా ఐదు రంగాలలో బహుమతులు ఇవ్వాలని ఈ స్వీడిష్‌ శాస్తవ్రేత్త నిర్దేశించారు. భౌతిక, రసాయనిక, శరీర నిర్మాణం లేదా వైద్య శాస్త్రంతో పాటు.. అత్యున్నత గ్రంథానికి సాహిత్యంలోనూ, అంతర్జాతీయ రంగంలో శాంతి కోసం.. విశిష్ట సేవలు చేసినందుకు ఐదుగురిని ఎంపిక చేసి ఈ నోబెల్ బహుమతిని అందజేయాలని ఆల్ఫ్రెడ్ నోబెల్ తన విల్లులో రాశారట. ఈ నోబెల్ బహుమతులను.. ప్రతీ ఏటా ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి రోజు అంటే.. డిసెంబర్ 10న అందిస్తుంటారు. ఆ రోజు నోబెల్ బహుమతి గ్రహీతకు ఒక సర్టిఫికేట్‌తో పాటు.. బంగారుపతకం, నగదు, నోబెల్ బహుమతి నిర్ధారణ పత్రాలను అందిస్తారు.

అయితే ఇప్పుడు తాజాగా నోబెల్ బహుమతికి ఇచ్చే నగదు విలువను పెంచారు. స్వీడిష్ కరెన్సీ బాగా క్షీణించడంతో.. ఈ ఏడాది డిసెంబర్ 10న అందించే నోబెల్ బహుమతుల ప్రైజ్ మనీని 11 మిలియన్ క్రోనార్లకు అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే.. రూ. 8,54,39,011.74కు పెంచింది. స్వీడిష్ కరెన్సీ గణనీయమైన తగ్గుదల వల్ల నోబెల్ ఫౌండేషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి 15 సంవత్సరాలుగా నోబెల్ బహుమతి విషయంలో ఇలా చాలా సార్లు సర్దుబాట్లు జరిగాయి.

2023 సంవత్సరానికి అందించబోయే నోబెల్ బహుమతి గ్రహీతలను అక్టోబర్‌లో అధికారికంగా ప్రకటిస్తూ ఉంటారు. ప్రతీ ఏడాది డిసెంబర్ 10 న జరిగే వేడుకల్లో.. ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డును అందుకోవడానికి ఆహ్వానిస్తుంటారు. అలా భారతీయులతో పాటు..భారత సంతతికి చెందిన వారు అలాగే భారత పౌరసత్వం స్వీకరించినవారితో కలిపి మొత్తంగా ఎనిమిది మంది ప్రముఖులు ఇప్పటి వరకూ నోబెల్ ప్రైజ్ అందుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + eighteen =