సచివాలయం తరలింపు ప్రారంభం

AP Government, AP News, ap temporary secretariat, latest news updates, latest telugu news, Mango News Telugu, Secretariat Shifting Process Begins, Shifting Process Of Secretariat Begins, telangana, telangana government, Telangana News, Telangana Political News, Telangana Politics, telangana secretariat, Telangana Secretariat Shifting Process Begins, telugu news

తెలంగాణ సచివాలయ తరలింపు పక్రియ బుధవారం ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయ కార్యాలయాలను త్వరగా తరలించే ఏర్పాట్లు చేయాలనీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే జోషిని ఆదేశించారు. ముందుగా రోడ్లు, భవనాలు రవాణా కార్యాలయం ఎర్రమంజిల్ లో జలసౌధ ఆవరణలో ఉన్న భవనంలోకి తరలించారు, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ముందుగా వెళ్లి, రేపటి నుండి సిబ్బందిని అక్కడికే రావాలని ఆదేశాలు జారీ చేసారు. ఆ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కార్యాలయాన్ని కూడ అక్కడికే తరలించారు. ఇతర శాఖల ముఖ్య కార్యదర్శులతో ఎస్.కే జోషి సమావేశం నిర్వహించి బిఆర్కే భవన్లో స్థలం కొరతపై చర్చించారు. ఏ శాఖను ఎక్కడికి తరలించాలనే విషయంపై వివరణ ఇచ్చారు.

శుక్రవారం వారం నాడు సీఎస్ కార్యాలయాన్ని బూర్గుల రామకృష్ణ భవన్ (బిఆర్కే)కు తరలించనున్నారు, ముందుగా మంత్రుల కార్యాలయాలు తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్టు తెలుస్తుంది. సచివాలయం నుంచి ఎక్కువ శాతం కార్యాలయాలు బిఆర్కే భవన్ కు తరలించాలని నిర్ణయం తీసుకోవడంతో, అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరగక పోవడంపై తరలింపు విషయంలో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెలలోనే కార్యాలయాల తరలింపు పూర్తి చేసి, సచివాలయ భవనాల తొలగింపు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలుస్తుంది. బిఆర్కే భవన్ లో ఇంటర్నెట్ వ్యవస్థ ఏర్పాటుకు సమయం కావాలని ఐటీ శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. ప్రస్తుతానికి స్మార్ట్ ట్రాక్ టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించుకున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=6W6Hn7ZIBEI]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + sixteen =