జూలై 8, 9 తేదీల్లో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ.. గుంటూరు లోని ‘ఆచార్య నాగార్జున యూనివర్శిటీ’ వద్ద నిర్వహణకు ఏర్పాట్లు

YSR Congress Party To Conduct Plenary on July 8th and 9th at Acharya Nagarjuna University Guntur, YSR Congress Party To Conduct Plenary on July 8th and 9th, YSR Congress Party To Conduct Plenary at Acharya Nagarjuna University Guntur on July 8th and 9th, Acharya Nagarjuna University Guntur, YSRCP To Conduct Plenary at Acharya Nagarjuna University Guntur on July 8th and 9th, YSRCP To Conduct Plenary on July 8th and 9th at Acharya Nagarjuna University Guntur, YSRCP to conduct first plenary, YSR Congress Party's Plenary on July 8th and 9th at Guntur, YSRCP first plenary on July 8th and 9th at Acharya Nagarjuna University Guntur, YSRCP first plenary, YSRCP plenary, YSR Congress Party, YSRCP, YSRCP plenary News, YSRCP plenary Latest News, YSRCP plenary Latest Updates, YSRCP plenary Live Updates, Mango News, Mango News Telugu,

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ త్వరలోనే ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న 12 ఎకరాల విస్తీర్ణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని జూలై 8, 9 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక తొలిసారిగా ప్లీనరీ నిర్వహించనుండటం ఇదే ప్రధమం. 2019లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం ప్లీనరీలను నిర్వహించేది. అయితే, ఎన్నికల కారణంగా 2019లో మరియు కరోనావైరస్ మహమ్మారి కారణంగా 2020 మరియు 2021లో ప్లీనరీని నిర్వహించలేకపోయింది.

దీంతో ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది. ఈ ప్లీనరీకి దాదాపు 30 వేల మంది పార్టీ కార్యకర్తలు హాజరుకానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ప్లీనరీ జూలై 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ మేరకు పార్టీ నేతలతో సమావేశమై వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ప్లీనరీలో ఆమోదించాల్సిన తీర్మానాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రతిపక్షాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.

సీఎం జగన్ ఢిల్లీ టూర్ తర్వాత దీనిపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే రాష్ట్ర ప్రజల కోసం వైసీపీ ప్రభుత్వం గత మూడేళ్లలో చేసిన ప్రతి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయాలని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ గుర్తు చేయడం ద్వారా మళ్లీ వైఎస్సార్‌సీపీకి ఎందుకు ఓట్లు వేయాలో రాష్ట్ర ప్రజలకు తెలియజేయడమే ప్లీనరీ ప్రధాన ఎజెండాగా ముందుకు సాగనుందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే ఇటీవల ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఒంగోలులో నిర్వహించిన మహానాడు విజయవంతమైనట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అధికార వైసీపీ ప్లీనరీపై ప్రత్యేక దృష్టిని పెట్టనుంది. ఈ ప్లీనరీని అద్భుతంగా నిర్వహించడం ద్వారా ప్రజలలో ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంది అని చాటడానికి ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + one =