లక్ష మంది భారతీయలు తల్లిదండ్రులకు దూరమయ్యే ప్రమాదం

Over Four Lakh Indians Still Waiting For US Green Card,Over Four Lakh Indians Still Waiting,Waiting For US Green Card,Indians Still Waiting For Green Card,US Green Card,Mango News,Mango News Telugu,green card issuance, green card, One lakh Indians ,10.7 lakh Indians, America,Four Lakh Indians Latest News,US Visa Backlog Increases,US Green Card backlog,Four Lakh Indians Latest Updates,Four Lakh Indians Live News,Four Lakh Indians Live Updates,Indians For US Green Card News Today,US Green Card latest updates

గ్రీన్‌కార్డ్‌.. అమెరికాలో స్థిరపడాలని అనుకుంటున్నవారి కల. అగ్రరాజ్యంలో ఉద్యోగం చేసుకుంటూ శాశ్వతంగా అక్కడే ఉండాలని ప్లాన్‌ చేసుకునే వారు గ్రీన్‌ కార్డ్‌ కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఐతే.. ప్రస్తుతం అమెరికా గ్రీన్‌కార్డ్‌ జారీలో చాలా ఆలస్యం చేస్తోంది. దీనివల్ల దాదాపు లక్ష మంది భారతీయ చిన్నారులు తమ తల్లిదండ్రులకు దూరమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇప్పటికే గ్రీన్‌ కార్డు కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే అమెరికా పరిమిత సంఖ్యలోనే ప్రస్తుతం గ్రీన్‌ కార్డులు జారీ చేస్తోంది. ఇప్పుడిదే చిన్నారులను తమ తల్లిదండ్రులకు దూరం చేసేలా మారబోతోంది.

అమెరికాలో గ్రీన్‌ కార్డు కోసం ఇప్పటికే 10.7 లక్షలకుపైగా భారతీయులు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. వివిధ దేశాలకు సంబంధించి గ్రీన్‌ కార్డుల జారీలో పరిమితులు ఉన్నాయి. కేవలం ఏటా 7 శాతం మంది విదేశీయులకే అమెరికా గ్రీన్‌ కార్డులు ఇస్తోంది. దీంతో కేవలం భారతీయులు మాత్రమే కాకుండా విద్యా, ఉద్యోగాల నిమిత్తం అమెరికాకు చేరుకున్న వివిధ దేశాల వారందరికీ గ్రీన్‌ కార్డులు జారీ చేయాలంటే ఇందుకు దాదాపు ఏకంగా 134 ఏళ్లు పడుతుందని అంచనా.

గ్రీన్‌ కార్డు కోసం వేచిచూసే వారిలో మరణాలు, వృద్ధాప్యం వంటి కారణాలతో కొందరు ఈ జాబితా నుంచి తగ్గిపోయినా.. అందరికీ గ్రీన్‌ కార్డులు జారీ ప్రక్రియకు 54 ఏళ్లు పడుతుందని చెబుతున్నారు. దీంతో వేలాది మంది భారతీయ పిల్లలు వారి తల్లిదండ్రులకు దూరమయ్యే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. హెచ్‌1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారి పిల్లలు హెచ్‌–4 వీసా కింద తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి అవకాశం ఉంది. అయితే, హెచ్‌–4 కేటగిరి కింద పిల్లల వయసు 21 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే అమెరికాలో ఉండే అవకాశం ఉంటుంది. ఈలోపు గ్రీన్‌ కార్డు తెచ్చుకోలేకపోతే 21 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత అక్కడ ఉండేందుకు అనుమతి ఉండదు.

అయితే, డాక్యుమెంటెడ్‌ డ్రీమర్స్‌గా ఇలాంటి వారికి రెండు ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. చదువుకునే విదేశీ విద్యార్థులకు ఇచ్చే ఎఫ్‌1 వీసా పొందడం లేదా తమ మాతృదేశానికి వెళ్లిపోవడం. అయితే చిన్నప్పటి నుంచి అమెరికాలోనే ఉండి అక్కడే చదువుకొని.. చివరకు దేశం విడిచి వెళ్లిపోవడం చాలా కష్టం. తల్లిదండ్రులు అమెరికాలో ఉండిపోతే ఈ పిల్లలు ఇండియాకు వచ్చి కుటుంబాన్ని వదిలి ఏం చేస్తారనేదే ప్రశ్న.

దీంతోనే గ్రీన్‌ కార్డుల జారీని వేగవంతం చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇటీవల పౌరసత్వ బిల్లును అక్కడి కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. గ్రీన్‌ కార్డుల జారీకి దేశాలవారీ కోటాను ఎత్తివేయాలనే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. అలాగే హెచ్‌ 1బీ వీసాలలో ముఖ్యమైన మార్పులు చేయాలనే ప్రతిపాదన సైతం ఇందులో చోటు చేసుకుంది. దేశాలవారీ కోటాల వల్ల మునుపటి సంవత్సరాల్లో ఎవరికీ కేటాయించకుండా మిగిలిపోయిన గ్రీన్‌ కార్డులను వలసదారుల సంతానానికీ, భార్య లేదా భర్తకు మంజూరు చేయడం ద్వారా వారి కుటుంబాలను విడిపోకుండా సమైక్యంగా ఉంచాలని ప్రతిపాదించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే లక్షలాది మంది భారతీయులతో పాటు మెక్సికన్లు, చైనీయులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =