బిగ్ బాస్- 3 సభ్యులు వీళ్లేనా?

Bigg Boss 3 Latest News, Bigg Boss 3 Telugu 14 Contestants Final List Confirmed, Bigg Boss 3 Telugu Contestants Latest News, Bigg Boss 3 Telugu Contestants List, Bigg Boss 3 Telugu Final Contestants List, Here is the confirmed list of Bigg Boss 3 housemates, Mango News

బిగ్ బాస్ సీజన్3 తెలుగు జూలై 21 ఆదివారం నాడు ప్రారంభమవుతుంది, ఈ సీజన్ కి కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవరించనున్నారు. గత రెండు సీజన్లు విశేష జనాదరణ పొందడంతో, ఇటు బుల్లితెర ప్రేక్షకులు, బిగ్ బాస్ కార్యక్రమం అభిమానులు , మరి ముఖ్యంగా నాగార్జున హోస్ట్ అవ్వడంతో సినీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్, సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసారు. ఫైనల్ దశకు చేరుకునేసరికి రెండు సీజన్లు ప్రజలనుండి అమితమైన ఆదరణ ని పొందాయి. మొదటి సీజన్లో శివబాలాజీ, రెండో సీజన్లో కౌశల్ బిగ్ బాస్ విజేతలుగా నిలిచారు. అయితే రెండో సీజన్లో ఎపిసోడ్ ఎపిసోడ్ కి జరిగిన పరిణామాలతో బిగ్ బాస్ షో తెలుగు రాష్ట్రాల్లో అనేక సార్లు వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో జూలై 21 ప్రారంభమవుతున్న మూడో సీజన్ ప్రాధాన్యత సంతరించుకుంది.

బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు పాల్గొనే సభ్యులపై ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే రెండో సీజన్లో పాల్గొన్న నూతన్ నాయుడు తన ఛానల్లో బిగ్ బాస్ 3 సభ్యులు వీళ్ళేనంటూ 15 మంది పేర్లు విడుదల చేసాడు. వారిలో నటి హేమ,యాంకర్ శ్రీముఖి, తీన్మార్ యాంకర్ సావిత్రి, నటి హిమజ,వరుణ్ సందేశ్- వితిక షెరు దంపతులు, బుల్లితెర నటుడు రవికృష్ణ, అలీరేజా, టీవీ9 జర్నలిస్ట్ జాఫర్,నటి పునర్వీ భూపాలం, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సింగర్ రాహుల్, మహేష్ విట్టా, టివి నటి రోహిణి ఉన్నారు. రెండురోజుల్లో మొదలయ్యే బిగ్ బాస్ 3 తెలుగు, ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here