50 రోజుల ‘అఖండ’ జైత్రయాత్ర

Akhanda Movie, Akhanda Movie Collections, Akhanda Movie Crosses 50 days, Akhanda Movie Crosses 50 days with 200 Crore Collections, Akhanda Movie News, Akhanda Movie Rating, Akhanda Movie Updates, Balakrishna Akhanda Movie, Balakrishna Akhanda Movie Crosses 50 days, Mango News, Nandamuri Balakrishna, Nandamuri Balakrishna Akhanda Movie, Nandamuri Balakrishna Akhanda Movie Crosses 50 days, Nandamuri Balakrishna Akhanda Movie Crosses 50 days with 200 Crore Collections, Nandamuri Balakrishna Movies

దాదాపు రెండు దశాబ్దాల క్రితం తెలుగు సినిమాలు థియేటర్లలో 100 రోజులు ఆడేవి. ఒక దశాబ్దం క్రితం 50 రోజులు ఆడేవి. కానీ ప్రస్తుతం సినిమా ఒకవారం.. మహా అయితే రెండు వారాలు థియేటర్లలో ఆడుతున్నాయి. ఈదైనా సినిమా సూపర్‌ హిట్‌ అయితే.. ఒక నెల కంటే ఎక్కువ ఆడడం కష్టమే. అలాంటిది.. ఓ సినిమా 50 రోజులు పైగా థియేటర్స్‌లో ఆడుతుందంటే మాములు విషయం కాదు. దాదాపు దశాబ్దం తర్వాత ఆ ఘనతను నందమూరి బాలకృష్ణ సాధించారు. ఆయన హీరోగా నటించిన ‘అఖండ’ మూవీ 50 రోజులు పూర్తి చేసుకొని హిస్టరీ రిపీట్‌ చేసింది. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాకి దర్శకుడు.

కరోనా కారణంగా.. గత 2 సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్న చిత్ర పరిశ్రమ.. థియేటర్లలో కనిపించని ప్రేక్షకులు.. ఆంధ్రాలో సినిమా టిక్కెట్ల ఇష్యూ.. భారీ బడ్జెట్ తో నిర్మించడం.. ఇన్ని ప్రతికూలతలు మధ్య ‘అఖండ’ సినిమా గతేడాది డిసెంబర్‌ 2న థియేటర్లలో విడుదలైంది. అయితే, బాలయ్య-బోయపాటి మ్యాజిక్ చేశారు. విడుదలైన తొలి రోజు నుంచే బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది ఈ చిత్రం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 152 కోట్ల గ్రాస్, రూ.93 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. నాన్ థియేట్రికల్‌తో కలిపి ఈ సినిమా రూ. 200 క్లబ్బులో ప్రవేశించినట్టు ‘అఖండ’ చిత్ర నిర్మాతలు రూ. 200 క్లబ్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. అంతేకాదు ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించబడటం ఒక రికార్డుగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 13 =