హరిహర వీరమల్లుపై క్రేజీ అప్‌డేట్‌

Pawan Kalyans Upcoming Movie Hari Hara Veera Mallu Shooting Latest Update,Pawan Kalyans Upcoming Movie,Upcoming Movie Hari Hara Veera Mallu,Movie Hari Hara Veera Mallu Shooting,Hari Hara Veera Mallu Shooting Latest Update,Pawan Kalyans Upcoming Movie Latest Update,Mango News,Mango News Telugu,Major setback for Pawan Kalyan,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Latest News,Hari Hara Veera Mallu Latest Updates,Hari Hara Veera Mallu Live News,Pawan Kalyan Hari Hara Veera Mallu,Pawan Kalyan Hari Hara Veera Mallu News Today,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan Latest Updates

ఏ ముహూర్తాన హరిహర వీరమల్లు సినిమాను ప్రారంభించారో కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఏళ్లుగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటివరకు దాదాపు 70 శాతం మాత్రమే పూర్తయింది. ఇంక బ్యాలెన్స్ 30 శాతం మిగిలే ఉంది. ఈ సినిమా నిర్మాతలు కూడా దీనికి సంబంధించి ఎటువంటి అప్ డేట్ ఇవ్వడం లేదు.

హరిహర వీరమల్లు సినిమా ప్రారంభమైనప్పుడు దీనిమీద భారీ అంచనాలుండేవి. నిదానంగా షూటింగ్ జరుగుతుండటంతో ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడంలేదు. ఇక ఈ మూవీలో కథానాయకుడు పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్. నిర్మాత ఏఎం రత్నం. ఇంతమంది మహామహులు ఉన్నా కూడా ఈ సినిమాను నత్తనడకన నడిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

హరిహర వీరమల్లు కోసం ఎక్కువ డేట్లు కేటాయించాల్సి ఉండటంతో.. తక్కువ డేట్లు ఉన్న రెండు సినిమాలను ముందుగా పవన్ పూర్తి చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబరు మొదటివారం నుంచి పవన్ కల్యాణ్ దీనికి డేట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఇది తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి స్వరాలందిస్తున్నారు. నోరా ఫతేహి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికన్నా ఆలస్యంగా షూటింగ్ ప్రారంభమైన బ్రో సినిమాతోపాటు మరో సినిమాను పవన్ కల్యాణ్ పూర్తిచేశారు. ఇక బ్రో సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అలాగే సుజిత్‌ ఓ సినిమా, హరీష్‌ శంకర్‌తో మరో సినిమా కమిట్‌ అయ్యారు పవన్‌. వచ్చే ఎన్నికలలోపు ఈ సినిమాలు అన్ని పూర్తిచేయాలన్నది పవన్‌ టార్గెట్‌. ఇకపోతే.. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోన్న వీరమల్లుకు ఎట్టకేలకు కదలిక రావడంతో.. ఈ సినిమాకు ఇకనైనా మోక్షం కలిగిందంటూ ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =