రాజ్యసభలో ఆరుగురు టీఎంసీ ఎంపీలపై సస్పెన్షన్

6 TMC MPs suspended for the day as disruptions continue, 6 TMC MPs Suspended for the Day over Ruckus, 6 TMC MPs Suspended From Rajya Sabha, 6 TMC MPs Suspended from Rajya Sabha for a Day, Mango News, Parliament, Parliament Monsoon Session, Parliament proceedings live, Six TMC MPs suspended for the day for creating ruckus, Six TMC MPs suspended from Rajya Sabha, TMC MPs Suspended from Rajya Sabha

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా లోక్‌సభ, రాజ్యసభల్లో పెగాసస్‌ స్పైవేర్ వ్యవహారం, వ్యవసాయ చట్టాల రద్దు, ఇంధన ధరల పెరుగుదల సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యులు చర్చకు పట్టుబడుతుండడంతో ఉభయసభల్లో ప్రతిరోజూ వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఆరుగురు టీఎంసీ ఎంపీలు ఒక రోజు పాటుగా సమావేశాల నుంచి సస్పెండ్ అయ్యారు. పెగాసస్ వ్యవహారంపై ఇతర ప్రతిపక్ష ఎంపీలతో కలిసి ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసినందుకు గానూ వారిని సస్పెండ్ చేస్తునట్టు రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు.

ముందుగా బుధవారం నాడు సభలో టీఎంసీ మరియు ఇతర ప్రతిపక్ష ఎంపీలు పెగాసస్ పై చర్చకు డిమాండ్ చేస్తూ, ప్లకార్డ్స్ ప్రదర్శించారు. వెల్ లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ్యుల నిరసనపై ఛైర్మన్ వెంకయ్య నాయుడు స్పందిస్తూ, అందరిని తమ తమ స్థానాలలోకి తిరిగి వెళ్లాలని కోరారు. లేకుంటే ప్లకార్డులతో నిరసన, చైర్మన్ కుర్చీని అగౌరవ పరిచినందుకు గానూ వారిపై 255 నిబంధనను అమలు చేయనున్నట్టు తెలిపారు. అయినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను వాయిదా వేశారు. అనంతరం రాజ్యసభ సెక్రటెరియట్ ఆరుగురు ఎంపీలు సస్పెన్షన్ పై ప్రకటన విడుదల చేసింది. టీఎంసీకి చెందిన అబిర్ రంజన్ బిశ్వాస్, శాంతా ఛెత్రి, డోలా సేన్, ఎండీ.నదీముల్ హక్, అర్పిత ఘోష్ మరియు మౌసం నూర్‌ ను ఒకరోజు పాటుగా సస్పెండ్ చేస్తునట్టు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here