గంటలోనే కోటీశ్వరుడైన పంజాబీ..

A Bank Clerk in Punjab Wins Lucky Lottery and Turns into Millionaire within Hours,A Bank Clerk in Punjab Wins Lucky Lottery,Clerk in Punjab Wins Lucky Lottery,A Bank Clerk Turns into Millionaire,Bank Clerk Turns into Millionaire within Hours,Mango News,Mango News Telugu,A bank clerk wins a jackpot,A young Punjabi bank clerk wins the lottery,Nagaland State lottery,A bank clerk got rich,Clerk Wins Lucky Lottery Latest News,Clerk Wins Lottery Latest Updates,Punjab Clerk News Today,Punjab Clerk Latest News,Punjab Clerk Latest Updates

అదృష్టం కలిసిరాకపోతుందా అని చాలామంది లాటరీ టికెట్స్‌ కొంటూ ఉంటారు. మరికొందరైతే ఎప్పటికైనా తగలకపోతుందా అని ఏళ్ల తరబడి లాటరీ టికెట్స్‌ కొంటూనే ఉంటారు. జాక్‌పాట్‌ తమకు ఎప్పుడు తగులుతుందా అని ఎదురు చూస్తూనే ఉంటారు. ఐతే.. చాలామందికి ఎదురుచూపులే మిగులుతాయి. ఎంతో అదృష్టం ఉంటేగానీ.. లాటారీల్లో జాక్‌ పాట్‌ కొట్టి కోటీశ్వరులు కాలేరు. కానీ.. ఓ వ్యక్తి లాటరీ టిక్కెట్ కొన్న గంటకే కోటి రూపాయలు గెలుచుకోవడం గురించి విన్నారా..? పంజాబ్‌లో ఒక వ్యక్తికి ఇలాంటి జాక్‌పాట్‌ తగిలింది.. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కావడం అతని వంతైంది. ఇంతకీ ఎవరా వ్యక్తి..?

పంజాబ్‌ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ జిల్లా డేరా బాబా నానక్ టౌన్‌కు చెందిన రూపీందర్‌జిత్ సింగ్ అగ్రికల్చర్ డెవలెప్‌మెంట్ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. అందరిలాగే ఈయన కూడా ఏడాదికాలంగా లాటరీ టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నాడు. కానీ ఇంత తొందరగా లక్ష్మీదేవి తన ఇంటికి నడిచిస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. అవును.. గెలిచిన ఆనందంలో ఉన్న రూపీందర్‌సింగ్‌ చెప్పిన మాటలే ఇవి. ఎప్పటిలాగే రూపీందర్‌జిత్ సింగ్ నాగాల్యాండ్ లాటరీ టిక్కెట్లు ఒక్కోటి 6 రూపాయల చొప్పున 25 టికెట్లను కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఆఫీసుకెళ్లి తన పనిలో నిమగ్నమైపోయాడు. గంట తరువాత లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఏకంగా ఈ లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నట్టు సమాచారం అందించడంతో ఎగిరి గంతేశాడు రూపిందర్‌. ఇన్నాళ్లకి తన కల నెలవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ డబ్బును తన పిల్లలు, కుటుంబం భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానన్నాడు. అంతేకాదు ఆపదలో ఉన్న పేదలకు కూడా సాయం చేస్తానని చెప్పాడు.

ఇకపోతే.. తన అలవాటే తనను కోటీశ్వరుడిని చేసిందని రూపిందర్‌జిత్‌ చెప్పాడు. లాటరీని గెలుచుకున్నందుకు బ్యాంకు సిబ్బంది అభినందించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫోన్లు చేశారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో కిరాణా దుకాణం యజమానికి లాటరీలో రెండున్నర కోట్ల బంపర్ ప్రైజ్ వచ్చింది. రూపిందర్‌జిత్‌ కూడా బంపర్ ప్రైజ్ గెలవడంతో డేరా బాబా నానక్ టౌన్ పేరు మరోసారి మారుమోగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 2 =