మాస్ మహరాజ్‌కు ఇచ్చిన హామీ సంగతేంటి?

Eagle, Even in February,competition for Eagle, Mas Maharaj,Eagle movie, Karthik Ghattamaneni,Ravi Teja,Mahesh Babu, Guntur Karam, Teja Sajja, Hanuman Movie
Eagle, Even in February,competition for Eagle, Mas Maharaj,Eagle movie, Karthik Ghattamaneni,Ravi Teja,Mahesh Babu, Guntur Karam, Teja Sajja, Hanuman Movie

సంక్రాంతి వస్తుందంటేనే సినీ లవర్స్‌కు పెద్ద పండుగ వస్తుంది. పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకూ థియేటర్లలో సందడి చేస్తూ పండుగ జోష్‌ను రెట్టింపు చేస్తాయి. అందుకే భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా సంక్రాంతి బరిలో దిగడానికి ఉత్సాహం చూపిస్తాయి. అయితే కరోనా తర్వాత ఆడియన్స్ పల్స్ పట్టుకోవడం ఎవరి తరం కావడం లేదు.

దీంతో సెలక్టివ్ సినిమాలనే సంక్రాంతి సమయంలో రిలీజ్ చేసి మిగిలిన సినిమాలను కాస్త అటూ రిలీజ్ అయ్యేలా సర్ధుబాటు చేసుకుంటున్నారు. తాజాగా మాస్ మహారాజ్ నటించిన ఈగల్ సినిమా సంక్రాంతికి వస్తుందని మూవీ మేకర్స్ ప్రకటించినా.. ఫిలించాంబర్ ఎంట్రీతో మనసు మార్చుకుని వెనక్కి తగ్గింది.

సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడానికి ఎవరు డేట్‌ అడ్జస్ట్ చేసుకుంటారో వాళ్లకు సోలో డేట్ ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చింది. ఆ నమ్మకంతోనే ఈగల్‌ టీమ్ వెనక్కి తగ్గి..పోటీ నుంచి తప్పుకొని ఫిబ్రవరి 9న తమ మూవీ రిలీజ్ అంటూ కొత్త డేట్‌ను ఎనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ చూస్తుంటే.. ఆ డేట్‌ కూడా ఈగల్‌కు సోలోగా దొరికే పరిస్థితి ఎక్కడా కనిపించటం లేదు. రవితేజ హీరోగా కార్తిక్‌ ఘట్టమనేని డైరక్షన్లో తెరకెక్కిన ఈగల్‌ మూవీ.. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. సంక్రాంతి బరిలో మహేశ్ బాబు గుంటూరు కారం ,తేజ సజ్జ హనుమాన్ మూవీలు సంక్రాంతి బరిలో ఉండటంతో.. చాంబర్ పెద్దలు రంగంలోకి దిగి ఈగల్‌‌ టీమ్‌ను ఒప్పించింది.

ఫిలించాంబర్ హామీ ఇచ్చినట్లుగా ఇప్పుడు పరిస్థితులు కనిపించలేదు. ఎందుకంటే  ఈగల్‌ డేట్‌ ఎనౌన్స్‌మెంట్‌ కంటే ముందే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ చాలా మూవీలు ఖర్చీఫ్‌లు వేసేశాయి. ఫిబ్రవరి 8న యాత్ర 2, 9న  టిల్లు స్క్వేర్‌, ఊరి పేరు భైరవ కోన  మూవీలు డేట్ లాక్ చేశాయి. అయితే ఈ సినిమాల ప్రమోషన్‌ ఎక్కడా కనిపించకపోవడంతో సోలోగా ఈగల్ దిగుతుందని అంతా అనుకున్నారు.  ఈగల్‌ మూవీ ఫిబ్రవరి 9న రిలీజ్ అని మేకర్స్ డేట్  ఎనౌన్స్‌ చేశాక కూడా ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలేవీ వెనక్కి తగ్గలేదు.అంతేకాకుండా.. రీసెంట్‌గా తమిళ డబ్బింగ్‌ మూవీ అయిన.. లాల్‌ సలాం కూడా కొత్తగా  ఫిబ్రవరి 9నే రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేసింది.  దీంతో ఆ డేట్‌కి కూడా మాస్ మహరాజాకు క్లాష్ తప్పేలా లేదు.

సంక్రాంతి బరిలో భారీ కాంపిటీషన్ ఉండటంతో వెనుకడుగు వేసిన ఈగల్..నెక్ట్స్ డేట్‌కి కూడా మినిమమ్‌ నాలుగు సినిమాలతో పోటీ పడక తప్పడం లేదు. దీంతో ఫిలించాంబర్ ఎంటర్ అవుతుందా లేక పని అయిపోయింది కదా ఇక తల దూర్చడం ఎందుకని సైలెంట్‌గా ఉంటుందో వేచి చూడాల్సిందే అంటున్నారు మాస్ మహారాజా ఫ్యాన్స్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =