ఎయిరిండియా ఘటనపై డీజీసీఏ సీరియస్.. రూ.30 లక్షల జరిమానా, పైలట్‌ లైసెన్స్‌ మూడు నెలలు రద్దు

Air India Urination Incident DGCA Slaps Rs 30 Lakh Penalty and Pilots Licence Suspended For 3 Months,Air India Urination Incident,DGCA Slaps Rs 30 Lakh Penalty,Pilots Licence Suspended,Mango News,Mango News Telugu,Ministry Of Civil Aviation,Directorate General Of Civil Aviation Recruitment,Car Dgca,Dgca Exam,Dgca Director General,Civil Aviation India,Directorate General Of Civil Aviation Upsc,Civil Aviation Requirements,Ministry Of Civil Aviation Address,Directorate General Of Civil Aviation

ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై ఒక ప్రయాణికుడు మూత్రం పోసినట్లు ఆరోపణలు వచ్చిన ఘటనపై డైరెక్టరేట్‌ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీరియస్ అయింది. తన విధులను నిర్వర్తించడంలో విఫలమైనందుకు గాను ఎయిర్ ఇండియా డైరెక్టర్-ఇన్-ఫ్లైట్ సర్వీసులపై రూ. 30 లక్షల జరిమానా విధించింది. అలాగే ఘటన జరిగిన న్యూయార్క్-ఢిల్లీ ఫ్లైట్ యొక్క పైలట్-ఇన్‌చార్జ్ లైసెన్స్‌ను మూడు నెలలుప్ పాటు రద్దు చేసింది. ఇక ఈ సంఘటన జనవరి 4న డీజీసీఏ దృష్టికి రాగా, వివిధ పరిశీలనల అనంతరం నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టమవడంతో తాజా చర్యలు తీసుకుంది.

కాగా గత ఏడాది నవంబర్ 26న మద్యం సేవించిన మత్తులో శంకర్ మిశ్రా అనే ప్రయాణీకుడు అదే విమానంలో ప్రయాణిస్తున్న ఇంకో మహిళపై మూత్ర విసర్జన చేయడం పెద్ద వివాదాస్పదమయింది. ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో కొద్దిరోజుల తర్వాత అతడిని ఢిల్లీ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఇక మూత్ర విసర్జన చేసిన ఘటనలో శంకర్ మిశ్రాపై ఎయిరిండియా గురువారం నాలుగు నెలల విమాన నిషేధాన్ని విధించింది. ఇక ఈ నేపథ్యంలో ఎయిరిండియా ఒక ప్రకటన విడుదల చేసింది. కొందరు ప్రయాణీకుల అభ్యంతరకర ప్రవర్తనకు సంబంధించి తమ సిబ్బందికి అవగాహన మరియు విధానాలను పాటించడంపై మరోసారి స్పష్టం చేస్తున్నాము, అని ఆ ప్రకటనలో పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here