బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో రేపే తుది తీర్పు

Babri Masjid, Babri Masjid Demolition, Babri Masjid Demolition Case, Babri Masjid Demolition Case Verdict, Babri Masjid demolition verdict, Babri Masjid Demolition Verdict LIVE Updates, Babri Masjid Ram Janmabhoomi Case, Babri Masjid-Ram Janmabhoomi dispute case, CBI court to pronounce Babri verdict, Verdict in Babri Masjid demolition case

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో సెప్టెంబర్ 30, బుధవారం నాడు తుది తీర్పు వెలువడనుంది. ల‌క్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. గతంలోనే ఈ కేసు విచారణను సెప్టెంబర్ 30 లోగా పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న 32 మందిని తీర్పు ఇచ్చే సమయంలో కోర్టులో హాజరుకావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. 1992, డిసెంబ‌ర్ 6వ తేదీన అయోధ్య‌లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన చోటుచేసుకుంది.

ఈ కేసులో బీజేపీ కీలక నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతి, యూపీ‌ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్‌ సహా పలువురు నిందితులుగా ఉన్నారు. వీరిలో ఉమా భారతి మరియు కళ్యాణ్ సింగ్‌లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. మిగతావారు కూడా కోర్టుకు హాజరయ్యే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు బాబ్రీ తీర్పు నేపధ్యంలో అన్ని రాష్ట్రాలలోని సున్నిత‌, స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో భ‌ద్ర‌తను పెంచాలంటూ కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింది. శాంతి, భ‌ద్ర‌త‌ల‌ స‌మ‌స్య త‌లెత్తే అవకాశం ఉండడంతో ముందస్తుగానే అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని సూచించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − one =