గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే హార్దిక్ ప‌టేల్‌కు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన జిల్లా కోర్టు

Gujarat Court Issues Arrest Warrant Against BJP MLA Hardik Patel For Failure To Attend Before It in 2017 Case,Gujarat Court Issues,Arrest Warrant Against BJP MLA,BJP MLA Hardik Patel,Attend Before It in 2017 Case,Mango News,Mango News Telugu,National Politics News,National Politics And International Politics,National Politics Article,National Politics In India,National Politics News Today,National Post Politics,Nationalism In Politics,Post-National Politics,Indian Politics News,Indian Government And Politics,Indian Political System,Indian Politics 2023,Recent Developments In Indian Politics,Shri Narendra Modi Politics,Narendra Modi Political Views,President Of India,Indian Prime Minister Election

గుజరాత్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే హార్దిక్ పటేల్‌కు షాక్ తగిలింది. ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు 2017లో ఒక కేసుకి సంబంధించి విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనపై సురేంద్ర‌న‌గ‌ర్ జిల్లా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలోని ఒక గ్రామంలో ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ హార్దిక్ పటేల్ రాజకీయ ప్రసంగం చేశారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా పటేల్ పలుసార్లు కోర్టుకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి ఆ కేసు విచారణకు రాగా ఎమ్మెల్యే హార్దిక్ కోర్టుకు హాజరుకాకపోవడంతో, అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ డిడి షా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఫిబ్రవరి 2 నాటి తన ఉత్తర్వుల ప్రకారం పటేల్‌ను అరెస్టు చేసి, తప్పకుండా కోర్టు ముందు హాజరుపరచాలని సురేంద్రనగర్ జిల్లాలోని ధృంగాద్ర తాలూకా పోలీస్ స్టేషన్ అధికారిని కోర్టు ఆదేశించింది.

ఇక హార్దిక్ పటేల్ మరియు సహ నిందితుడు కౌశిక్ పటేల్ హరిపర్ గ్రామంలో సమావేశాన్ని నిర్వహించడానికి అనుమతిని ఉల్లంఘించినట్లు తేలిన తరువాత జనవరి 12, 2018న ధృంగాధ్ర తాలూకా పోలీస్ స్టేషన్‌లో ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదైంది. ఎఫ్‌ఐఆర్ ప్రకారం, వీరిద్దరూ 2017 నవంబర్ 26న అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరిపర్ గ్రామంలో సమావేశం నిర్వహించేందుకు అనుమతి కోరగా, పోలీసులు వారికి కొన్ని షరతులతో అనుమతి ఇచ్చారు. అయితే సమావేశంలో భాగంగా హార్దిక్ పటేల్ మరియు కౌశిక్ పటేల్ తమ ప్రసంగంలో సదరు షరతులను ఉల్లంఘించారని పోలీసులు ఆరోపించారు. దీంతో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినందుకు శిక్షార్హులుగా వ్యవహరించే గుజరాత్ పోలీసు చట్టం, 1951లోని సెక్షన్లు 37 (3) మరియు 135 కింద వారిపై కేసు నమోదు చేయబడింది. కాగా నవంబర్ 2017లో ధుతార్‌పర్ గ్రామంలో జరిగిన మరో ర్యాలీలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి రాజకీయ ప్రసంగం చేసినందుకు జామ్‌నగర్‌లోని కోర్టు గత వారం ఇదే కేసులో పటేల్‌ను నిర్దోషిగా ప్రకటించడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − five =