అక్టోబర్‌ 5న జగనన్న విద్యా కానుక అందజేత, నవంబర్ 2 నుంచి స్కూల్స్

Andhra Pradesh, AP News, AP Schools reopening, AP Schools Reopening Postponed, School reopening in Andhra Pradesh, School reopening in Andhra Pradesh postponed, Schools In AP To Reopen, Schools Reopening In AP, Schools Reopening In AP Postponed, Schools Reopening In AP Postponed to November 2nd

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుగా అక్టోబర్‌ 5న స్కూళ్లు ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులు దృష్ట్యా స్కూళ్లు ప్రారంభాన్ని నవంబర్ 2 కు వాయిదా వేసినట్లుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం నాడు ‌ వెల్లడించారు. మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో నవంబర్‌ 2 వ తేదీ నుంచి స్కూళ్లు తెరవాలని నిర్ణయించామని తెలిపారు. అయితే స్కూల్ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ‘జగనన్న విద్యా కానుక’ పథకాన్ని అక్టోబర్ 5 న నిర్వహిస్తామన్నారు. ఆ రోజున విద్యాకానుక కిట్లను ప్రభుత్వం పిల్లలకు అందజేయనుందని చెప్పారు. షెడ్యూల్ ను బట్టి సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభంలో భాగంగా ఎదో ఒక స్కూల్‌కు వెళ్లే అవకాశముందని మంత్రి సురేష్‌ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 20 =